గాంధీని చంపిన గాడ్సే ఇతివృత్తంతో మరణవాంగ్మూలం సినిమా రూపుదిద్దుకోనుంది. దర్శకుడు భరద్వాజ రంగావధ్యుల తీయబోతున్నారు. గాంధీను చంపి గాడ్సే వెనుక కూడా ఒక కథ ఉంటుంది. ఇదొక్కటే కాదు.. ఆ రోజున గాంధీను చంపినపుడు గాడ్సే ఎలా ఆలోచించారు. దానికి సంబంధించి గాడ్సే మరణవాంగ్మూలం పేరుతో పుస్తకం రాశారు. దానిలో తాను ఎందుకు చంపాననే విషయాన్ని చెప్పారు. ఇది కేవలం ఈ ఒక్కరి గురించే కాదు.. చుట్టూ ఉన్నో ఎన్నో సంఘటనలు ప్రభావితం చేసే అంశాలు సినిమాలో ఉంటాయంటూ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వివరించారు. సినిమా షూటింగ్ ప్రారంభమైనట్టు ఆయన వెల్లడించారు. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన వాల్ పోస్టర్ రిలీజ్ చేశారు.



