వివాదాలు.. ఎప్పుడూ ఏదోఒక చిరాకులు.. ఆయన చుట్టు తిరుగుతూనేఉంటాయి. అధికారులైనా.. సొంతవాళ్లయినా లాభం లేదనుకుంటే దూరంగా ఉంచుతాడు. పగోడైనా.. పనికొస్తాడనుకుంటే పక్కనే పెట్టుకుంటాడు. అంతటి రాజకీయ నడపగల రాజకీయ నాయకుడు గంగుల కమలాకర్. కబ్జాలు. వసూళ్లు.. ఇవన్నీ మనోడికి కొత్తేం కాదంటారు అయినోళ్లే. అంతమాత్రాన నియోజకవర్గంలో జనం ఓడిస్తారనుకుంటారని అనుకోవటం కూడా పొరపాటే. ముందస్తు ఎన్నికల్లో గెలవటమే కష్టం అనుకున్నారు. కానీ నెగ్గాడు.. ఏకంగా మంత్రి పదవే దక్కించుకున్నాడు.
కరీంనగర్ శాసనసభ సీటు అంటే.. వెలమ సామాజికవర్గానికి కంచుకోట. అటువంటి నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు 2009, 2014, 2018 విజయం సాధించి హ్యాట్రిక్ వీరుడుగా నిలిచాడు. మంత్రి కేటీఆర్‌కు మంచి నమ్మకస్తుడు. 2000లో తొలిసారి రాజకీయ ప్రవేశం చేసిన గంగుల కరీంనగర్ మున్సిపల్ కౌన్సిలర్‌గా నెగ్గాడు. ఆ తరువాత 2009లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. 2013లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసినపుడు. పదవికి రాజీనామా చేసి.. కేసీఆర్ పక్కన చేరాడు. 2018లో అందరూ గంగుల పక్కాగా ఓడిపోతాడనుకున్న సమయంలో గెలిచి మంత్రిపదవి దక్కించుకున్నాడు. ఆ తరువాత జిల్లాలో తానే తిరుగులేని శక్తిగా మారాడు.
గంగుల రాసలీల వ్యవహారం ఇన్నాళ్లు కష్టపడి సంపాదించుకున్న కష్టాన్ని ఒక్కసారిగా దెబ్బతీసింది. ఇదంతా ఎవరైనా కావాలని చేశారా! పక్కా ప్లానింగ్ ప్రకారం ఇరికించారా! అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. దసరా వేడుకలకు వచ్చిన అందాల భామపై మనసుపడిన అతగాడు.. మన్మధుడుగా మారటం.. చికాకు పరిచేలా చేతులకు పనిచెప్పటం అని జరిగాయి. అక్కడ వరకూ విషయాన్ని రహస్యంగా ఉంచిన ఆ భామ.. హైదరాబాద్ రాగానే విషయాన్ని బయటకు పెట్టింది. తనతో గంగులోరు చేసిన ఛాటింగ్‌ను ఓ మీడియా ద్వారా లీకులిచ్చింది. అంతే.. గంగుల చీటి చిరిగిందనే అందరూ భావించారు. ఇదంతా కావాలని చేసిన కుట్రగానే గంగుల అనుచరులు చెప్పుకుంటున్నారట. టీఆర్ ఎస్‌లో మరొకరికి మంత్రి పదవి కట్టబెట్టడం కోసం గంగులను
పార్టీలని పెద్దలే ఇరికించారంటున్నారు. మరి ఇందులో నిజమెంత.. అనేది గంగుల నోరువిప్పాలి.. లేకపోతే.. గంగుల ఛీ..టి చిరిగిందని పార్టీపెద్దలే ప్రకటించాలి.