అమెరికన్లు బ్రెడ్ .. సౌదీయులు.. డ్రైఫ్రూట్స్.. భారత్‌లో ఉత్తరాధిన రొట్టెలు.. దక్షిణాధిన అన్నం… మనుషులందరూ ఎందుకు ఒకే తరహా ఆహారం తీసుకోరు. జంతువుల విషయానికి వస్తే.. క్రూరజంతువులు.. పులి, సింహం వంటివి మాంసాహారం తీసు కుంటాయి. అదే ఏనుగు, కోతి, జింకలు వంటి సాధుజీవులు శాకాహారంతో మనుగడ కొనసాగిస్తుంటాయి. వందలు.. వేలాది సంవత్సరాల నుంచి వస్తున్న అలవాట్లు. ఇదంతా ఎందుకు అనేందుకు చాలా కారణాలున్నాయనే భావన చాలా మందిలో కనిపిస్తుంది. వాస్తవానికి ఇదంతా జన్యుపరిణామం వల్ల వచ్చిన ఆహారపు అలవాట్లుగా పరిశోధకులు చెబుతున్నారు. లావయ్యామని.. రక్తపోటు, మధుమేహం ఉందనే భయంతో చాలా మంది రొట్టెలు తింటూ అన్నం మానేస్తుంటారు. ఇది కొంతవరకూ మంచిదే అయినా.. జనటికల్‌గా వస్తున్న అలవాట్లను మధ్యలో బ్రేక్ చేయటం వల్ల ఇబ్బందులు తలెత్తటమే కాదు.. కొన్నిసార్లు ఏరికోరి అనారోగ్యం కొనితెచ్చుకున్నట్టే. కాబట్టి..వారసత్వంగా వచ్చిన కొన్ని అలవాట్లను కొనసాగించటమే ఉత్తమం అనేది నిపుణుల సూచన కూడా.
పిల్లలు తీపి నే ఎక్కువగా ఎందుకు ఇష్టపడతారు. సాధారణంగా మనం భోజనం చేసేటప్పుడు రకరకాల ఆహార పదార్థాలు ఎదురుగా ఉన్నప్పటికీ మనం మాత్రం ఇష్టమైన వాటిని ముందుగా ఆరగిస్తాం. సరిగ్గా ఇదేవిధంగా జంతువుల్లో కూడా వాటికి దొరికిన రకరకాల ఆహార పదార్ధాలలో ముందుగా వాటికి ఇష్టమైన వాటిని తినటానికి ఇష్టపడతాయి. అంటే మనం తీసుకునే ఆహారం మన రుచిని బట్టి నిర్ణయించుకోవటమా లేక మన శరీరంలో శరీర నిర్మాణంలో భాగంగా నిర్ణయించుట మా అందరి ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఉదాహరణకు కుక్క మాంసాన్ని మాత్రమే ఎక్కువగా ఇష్టపడుతుంది. పిల్లి మేక మాంసం ఎక్కువ ఇష్టపడుతుంది. దానితోపాటు పాలను కూడా జన్మతః ఇష్టపడతాయి. అలాగే పులులు, సింహాలు కూడా కేవలం జంతు మాంసాన్ని ఆహారంగా స్వీకరిస్తాయి ఇక్కడ మనకు అనుమానం కలగవచ్చు . ఎందుకు ఈ జంతువు కేవలం వాటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి .అంటే ఇది పుట్టుకతో ఆహారం పట్ల ఇష్టం కలిగి ఉన్నాయనేది ప్రధానం కాదని అర్థం అవుతుంది .మనం మన ఆహార అలవాట్లు ఆధారంగా ఆహారాన్ని ఇష్టపడుతున్నాను. అంటే మనం కూడా నిర్మాణం మరియు జన టికల్ గా వచ్చిన జన్యు నిర్మాణం లో భాగంగా మన ఆహారపు అలవాట్లు మరియు రుచి ఆధారపడి ఉంటుందనేది స్పష్టమవుతుంది. జన్యు నిర్మాణంలో ఆ సమాచారం లో భాగంగా జంతువుల ఆహార అలవాట్లు , ఇష్టం కేవలం జన్యువుల నుంచే నిర్ణయించబడతాయనేది అర్ధమవుతుంది. ఇది నిజం. ఆవాసం ఆహారపు అలవాట్లు కేవలం జన్యు నిర్మాణం లో భాగంగానే నిర్మాణంతోపాటు ఇష్టాన్ని పొందుతాయని ఆయా జంతువుల బట్టి మనకి అర్థం చేసుకోవచ్చు.
ప్రతాప్ కౌటిల్య – బయోకెమిస్ట్రీ- అసిస్టెంట్ ప్రొఫెసర్ (Rtd), – 9502850832
Nice one