రాజధాని రాజకీయాలు హీటెక్కుతున్నాయి. బల్దియా ఎన్నికల్లో లడాయి మొదలైంది. ఏ పార్టీకు ఆ పార్టీ లోపల భయంతో మగ్గుతున్నా పైకి మాత్రం మేకపోతు గాంబీర్యం ప్రదర్శిస్తున్నాయి. దుబ్బాక దెబ్బ గట్టిగానే తగిలిన గులాబీ కూటమి హైదరాబాద్‌లో ఊహించని విధంగా పరాజయం ఎదురవుతుందనే భయానికి లోనవుతోంది. నిన్నటి వరకూ క్యాంపెయిన్ స్టార్.. సూపర్‌స్టార్ అంటూ పేరుపడ్డ మంత్రి హరీష్‌రావు మంత్రాంగం దుబ్బాక లో ఘోర వైఫల్యం చెందడటంతో గ్రేటర్ కేటీఆర్ చాణక్యం ఎంత వరకూ వర్కవుట్ అవుతుందనే దానిపై నీలినీడలు అలుముకున్నాయి. కేటీఆర్ మాటతీరులో కాస్త తోట్రుపాటు.. కోపం అన్నీ కనిపిస్తున్నాయి. గతానికి భిన్నంగా కేటీఆర్ నోటి నుంచి కూడా వ్యక్తిగత విమర్శలు రావటం పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. ఎంఐఎంతో దోస్తీ లేదని చెప్పిన ఆయన.. పాతబస్తీలో గతంలో ఐదు సీట్లు గెలిచామని.. ఇప్పుడు 10 డివిజన్లలో నెగ్గి తీరుతామంటూ సెలవిచ్చారు. నిజానికి 2016 ఎన్నికల్లో తెరాస పొత్తు లేకపోయినా.. మిత్రపార్టీగా ఉన్న ఎంఐఎంకు గట్టి పోటీ ఇచ్చింది. జాంబాగ్ డివిజన్‌లో టీఆర్ ఎస్ అభ్యర్ధి కేవలం 5 ఓట్ల తేడాతోనే ఓడాడంటే.. అర్ధం చేసుకోవచ్చు. అప్పట్లో కేసీఆర్ అంటే హైదరాబాద్ జనాల్లో ఉన్న అభిమానం ఏ పాటిదో.. కానీ ఇది 2020 ఐపీఎల్‌ను మించేలా మ్యాచ్ సాగుతోంది.
ఇటువంటి సమయంలోనే ఎంఐఎం ఎమ్మెల్యే చేసిన హాట్ కామెంట్స్ టీఆర్ ఎస్‌లో కలకలం సృష్టిస్తున్నా్యి. కేటీఆర్‌ను చిలుకతో పోల్చాని ఎమ్మెల్యే . ఎమ్మెల్యే పదవి అంటే .తమ ఇంటి గుమాస్తాతో సమానం అంటూ మరో మాట జారాడు. తాము తలచుకుంటే రెండు నెలల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామంటూ హెచ్చరించాడు. ఇదంతా ఎంఐఎం ఆడిస్తున్న డ్రామాగా
రాజకీయనాయరాలు, సినీనటి విజయశాంతి కొట్టిపారేశారు. రెండు పార్టీలు సయామీ కవలలుగా పోల్చారు. కేవలం ఓట్ల కోసం ఇదంతగా కలసి నడిపిస్తున్న డ్రామాగా కొట్టిపారేశారు. అయితే.. ఇది బీజేపీకు ఎంత వరకూ లాభిస్తుందనే అంచనాలు కూడా లేకపోలేదు. 150 డివిజన్లలో బీజేపీ 10 సీట్లు సాధిస్తే గొప్ప అనుకున్నారు. కానీ.. దుబ్బాకలో బీజేపీ గెలిచాక.. హైదరాబాద్‌లో వాతావరణంలో చాలా మార్పులొచ్చాయి. యువత బీజేపీ వైపు ఆకర్షితులయ్యారు. హిందుత్వ ఓట్లు, ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లన్నీదాదాపు బీజేపీ అభ్యర్థులకే అనే ప్రచారం సాగుతోంది. కలసి వచ్చిన అవకాశానికి జనసేన మద్దతు కూడా జతకట్టడంతో దాదాపు 40 మంది వరకూ బీజేపీ అభ్యర్థులు సునాయాసంగా గెలుస్తారనే ధీమా మొదలైంది.