తెలుగు రాష్ట్రాల్లో జగన్, కేసీఆర్ ఇద్దరికీ సీఎంలుగా ప్రజల్లో ఇమేజ్ ఉంది. మాస్‌లో క్రేజ్ కూడా గ్రాఫ్‌లో పెరుగుతూనే ఉంది. కానీ.. సొంత నేతల నోటి దురుసు చికాకులు పుట్టిస్తున్నాయి. సామాన్యుల పట్ల వారి ప్రవర్తన అధికార పార్టీకు సవాల్‌గా మారుతున్నాయి. తెలంగాణలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సమస్యలపై మాట్లాడినందుకు ఓ వ్యక్తిపై బూతుపురాణం విప్పారు. రికార్డింగ్ చేసుకోమంటూ మరీ సవాల్ విసిరారు. ఇదేమి తొలిసారి కాదు.. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు సేమ్ టు సేమ్ ఇదే విధంగా తమ నోటికి పనికల్పించి చిక్కులు కొని తెచ్చుకున్నారు. ఇంతకు ముందు అంటే.. ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఎమ్మెల్యే అంతటి వ్యక్తి.. కొట్టినా, తిట్టినా సాక్ష్యాలు ఉండేవి కాదు. పైగా అధికారానికి భయపడి బాధితులు కూడా సైలెంట్‌గా ఉండేవారు.. ఎందుకొచ్చిన తలనొప్పి అనుకుంటూ మీడియా కూడా చూసీచూడనట్టు వదిలేసేది. కానీ.. సోషల్ మీడియా పుణ్యమాంటూ.. రాజకీయ, సామాజిక చైతన్యమే కాదు.. అవతలి వారి గుట్టుమట్టు అంతా రికార్డ్ చేసి మరీ పరువు నడిబజార్లో పడేస్తున్నారు. ఏపీలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గుంటూరు జిల్లా కేంద్రంలోని నగరంపాలెం సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌తో మాట్లాడిన మాటలు.. బెదిరింపుల ఆడియో బయటకు రావటంతో వైసీపీ నేతలు ఉలికిపాటుకు గురయ్యారు. ఇలా.. ఏపీ, తెలంగాణాల్లో తమ అధికారం చాటుకోవాలనో.. అహం దెబ్బతినటం వల్లనో.. తరచూ నోరుజారే నేతల జాబితా పెరుగుతూనే ఉంది. ఇప్పటికైతే ఓకే.. రేపటికంటూ ఒక రోజుంది.. ఇప్పుడు తిట్లు తిన్న ఓటర్ల చేతిలోనే ఈవీఎంల మీట ఉంటుందని గుర్తించకపోవటమే పెద్దతప్పిదంగా పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి. ఎవరితో ఎలా మెలగాలనే అంశంపై
ప్రజాప్రతినిధులకు ట్రైనింగ్ ఇప్పిస్తే బావుంటుందనే ఆలోచనలో కూడా పడ్డారట.



