రాజకీయ దురంధురుడు.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ (84)సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన తనయుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. భారత రాజకీయాల్లో అజాతశత్రువుగా ముద్రపడిన ఆయన ఇటీవలే కరోనా భారినపడ్డారు. వైద్యపరీక్షల్లో మెదడులో రక్తం గడ్డకట్టినట్టు గుర్తించి శస్త్రచికిత్స చేశారు. అప్పటి నుంచి కోమాలోనే ఉన్న ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించటంతో పరమపదించారు. 1935 డిసెంబర్ 11వ తేదీ పశ్చిమబెంగాల్‌లోని మిరాఠీ గ్రామంలో జన్మించారు. 1969లో తొలిసారి బంగ్లా కాంగ్రెస్ సమావేశంలో ఆయన మాట తీరు చూసిన అప్పటి ప్రధాని ఇందిరా ముగ్థులయ్యారు. ఆ మరుసటి సంవత్సరమే రాజ్యసభకు ఎంపికయ్యారు. దాదాపు ఆరుదశాబ్దాల పాటు వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన ఇందిర
మరణం తరువాత రాజీవ్‌గాంధీను ప్రధాని చేయటాన్ని అంగీకరించలేదు. అనుభవం లేని నాయకత్వంతో దేశానికి సమస్యలు వస్తాయనే ఆందోళన దీనికి కారణం అంటారు. రక్షణ, ఆర్ధిక, విదేశీవ్యవహారాల మంత్రిగా పనిచేసిన ఆయనకు పార్టీలకు అతీతంగా మిత్రులు ఉండేవారు. 2012లో యూపీఎ సర్కారు ప్రణబ్‌ను రాష్ట్రపతికి నిలిపింది. ఆ ఎన్నికల్లో సంగ్మాపై నెగ్గిన ప్రణబ్ 2017
వరకూ రాష్ట్రపతిగా పనిచేశారు. ఆ తరువాత రాష్ట్రపతిగా ఉండేందుకు ఎన్‌డీఏ కూటమి అంగీకరించినా వయోభారంతో వద్దని సున్నితంగా తిరస్కరించారు. 2019లో భారతరత్నగా ఎంపికయ్యారు. ప్రణబ్ కేవలం ఆర్ధికవేత్త మాత్రమే కాదు.. రాజనీతిజ్ఞుడు కూడా. నీతి, నిజాయతీలకు నిలువుటద్దం. ప్రణబ్ ముఖర్జీకు ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తదితరులు నివాళులర్పించారు.
రాజీవ్ గాంధీ కి నచ్చకపోవడం వల్ల, అప్పటి బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఘానిఖాన్ చౌదరి చే ప్రణబ్ ని సస్పెండ్ చేయించారు..సొంత పార్టీ పెట్టి విఫలమయ్యారు..6 సం. తరువాత కాంగ్రెస్ గూటికి చేరారు…
చాలా బాగా రాసారు