చైనా వంకరబుద్దులు మార్చుకోవట్లేదు. లడ్హాఖ్ వద్ద దోబూచులాట ఆడుతూనే ఉంది. చైనా కుయుక్తులు తెలిసిన భారత ప్రభుత్వం కూడా ధీటుగానే బదులిస్తోంది. యుద్ధోన్మాదంతో చైనా కాలుదువ్వితే కత్తిరించేందుకు తాము సిద్ధమంటూ భారత్ సైన్యం బదులిచ్చింది. దండోపాయమే చివరి మార్గమంటూ ఆర్మీ కూడా భావిస్తుంది. కానీ.. అదను చూసి దెబ్బకొట్టేందుకు అవరసమైన ఆయుధ సంపత్తిని.. సైనిక బలగాలను మంచుకొండలకు తరలిస్తుంది. తాజాగా ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ బిపిన్ రావత్ కూడా చైనాకు గట్టిగానే హెచ్చరిక పంపారు. సావధానంగా చర్చలకు సిద్ధమంటే రెడీగా ఉన్నాం. కాదు.. లేదు.. వాళ్లు యుద్ధానికే సై అంటూ మనమూ సై అంటూ చెప్పకనే చెప్పారు. శాంతినే కోరుకునే భారత్ తనకై తాను యుద్ధానికి దిగదు. కాదని ప్రత్యర్థులు ఒక్కడుగు ముందుకేసినా తగిన బుద్ది చెప్పేందుకు ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ రెఢీ అంటూ బదులిచ్చారు రావత్. నిజమే.. దాదాపు ఆరేడు నెలలుగా చైనా సరిహద్దు వద్ద తరచూ కవ్వింపు చర్యలకు దిగుతోంది. రెండు నెలల క్రితం చైనా బోర్డర్‌లో తెలంగాణ వీరసైనికుడు చూపిన తెగువ చైనా లిబరేషన్ ఆర్మీ వెన్నులో వణకు పుట్టించింది. ఒక్క సంతోష్ కుమార్‌ను అడ్డుకోలేకపోయిన తమ ఎదుట లక్షలాది మంది సంతోష్‌లు ఉన్నారని తెలిసి వెనుకడుగు వేసింది. వాస్తవానికి చైనా బోర్డర్‌లో ఫింగర్ 8 వద్ద ఇండియా సైన్యం కాపలా ఉండేది. ఆ తరువాత ఇండియన్ ఆర్మీ కాస్త గస్తీ తగ్గించటాన్ని చైనా అనువుగా మలచుకుంది. దాదాపు ఫింగర్ 4 వద్దకు చేరి నిర్మాణాలు చేపడుతుంది. అంటే దాదాపు 5 కిలోమీటర్ల మేర భారత భూబాగంలోకి చొచ్చుకు వచ్చిన చైనా అదంతా తమదేనంటూ కొత్తపల్లవి అందుకుంది. అయినా భారత్ మాత్రం.. శాంతియుత చర్చలకే మొగ్గుచూపుతుంది. మరోవైపు బోర్డర్‌కు భారీగా యుద్ధవిమానాలు, సైన్యాన్ని తరలిస్తుంది. దీంతో భారత్ కూడా అత్యాథునిక ఆయుధాలను.. చాలా కష్టమైనా.. 1600 అడుగుల ఎత్తులోని పర్వత ప్రాంతానికి చేరవేసింది. ఇప్పుడు పై భాగంలో ఉన్న భారత్ ఆర్మీను ఎదుర్కోవటం చైనాకు సవాల్‌గా మారింది. ఏ మాత్రం తేడావచ్చినా.. భారత బలగాలు ధీటుగానే కాదు.. 1969 నాటి ఓటమికి కూడా ప్రతీకారం తీర్చుకోవాలనేంత కసిగా ఉన్నాయి. అందుకే.. చైనా దొడ్డిదారిన నేపాల్, శ్రీలంక,పాకిస్తాన్
వంటి చిన్న దేశాల ద్వారా భారత్‌ను దెబ్బతీయాలనే పన్నాగం పన్నుతోంది.