జనసేన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్. పోలింగ్ బూత్‌లలో ఏజెంట్లు లేరన్నచోట సర్పంచ్ పదవులు దక్కాయి. మున్సిపాలిటీలే కాదు.. గుంటూరు, విశాఖపట్టణం వంటి కార్పోరేషన్లలోనూ సేన జెండా ఎగురవేసింది. ఇదే అటు వైసీపీ, ఇటు టీడీపీలకు ఇబ్బందిగా మారిందట. పవన్ కళ్యాణ్‌ను పలుచన చేసేందుకు అడ్డదారులన్నీ వెతికే పనిలో పడ్డారట. వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి జనసేనను లైట్ గా తీసుకుంటుంది. కానీ.. టీడీపీ మాత్రం తన ఓటుబ్యాంకును చీల్చి ఘోరంగా ఓడిపోయేందుకు కారణమైందంటూ జనసేననే దుష్ర్పచారం మొదలుపెట్టింది. విశాఖ కార్పోరేషన్‌లో 40 వార్డుల్లో టీడీపీ గెలుపును జనసేన చీల్చిన ఓట్లు అడ్డుకున్నాయట. 2009లో వైఎస్సార్ ను కాపాడేందుకు ప్రజారాజ్యంతో చిరంజీవి చేసిన పని ఇప్పుడు వైసీపీను గట్టెక్కించేందుకు పవన్ జనసేన పెట్టాడంటూ వెర్రికూతలు కూసేంతగా దిగజారారట. ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా టీడీపీ పతనం అంచున్న ప్రయాణించటం.. పార్టీ పునాదులు కదలిపోవటం కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా నాయకత్వ కొరత 2019 ఎన్నికల్లో.. ఆ తరువాత 2021లో జరిగిన పంచాయతీ, మున్సిపల ఎన్నికల్లోనూ ఘోర పరాజయంతో టీడీపీ నిరూపించుకుంది. మరో వైపు జనసేన ఊహించని విధంగా ఒక్కో మెట్టు ఎగబాకుతూ సీట్లు,, ప్రజల ఓట్లు గెలుచుకుంటుంది. ఇదే కొనసాగితే 2024 నాటికి వైసీపీ, జనసేన మధ్యనే ఏపీలో ప్రధాన పోటీ అనేది కూడా వైసీపీ అంగీకరిస్తుంది. జగన్ మోహన్‌రెడ్డి కూడా తన పార్టీ నేతలకు జనసేనను తేలికగా తీసుకోవద్దంటూ హెచ్చరిస్తున్నారట. కాపుల ఓట్లు చీలటం.. రాబోయే యువత జనసేన వైపు మొగ్గుచూపటం రెండూ వైసీపీను వెంటాడుతున్న భయాలట. అందుకే.. టీడీపీ కూడా జనసేన తమ పార్టీను దెబ్బతీస్తుందంటూ.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమకు గాకుండా చేస్తుందంటూ పొర్లిపొర్లి ఏడుస్తూ.. జనసేనానిని శాపనార్ధాలు పెడుతుందట.