యువత ఎదుర్కుంటున్న సమస్యలను రొమాంటిక్ & కామెడీగా చూపిస్తూ వచ్చిన చిత్రం ‘జస్ట్ ఎ మినిట్’

ఏడు చేపల కథ ద్వారా పరిచయమైన అభిషేక్ పచ్చిపాల హీరోగా నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్ హీరోయిన్లుగా రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్, కార్తీక్ ధర్మపురి సమర్పించు సుధర్మ మూవీ మేకర్స్ సంయుక్తంగా తన్వీర్ మరియు ప్రకాష్ ధర్మపురి నిర్మాతలుగా యశ్వంత్ దర్శకత్వంలో వచ్చిన సినిమా జస్ట్ ఎ మినిట్. ఎడిటర్ గా దుర్గ నరసింహ, డిఓపి గా సమీర్ మరియు ఎస్. కె. బాజీ మ్యూజిక్ అందించారు.

కథ విషయానికొస్తే :
చెప్పుకోలేని ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న రవి (అభిషేక్ పచ్చిపాల). ఆ సమస్య నుంచి బయటపడడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అలా చేసే ప్రయత్నంలో తనకు పరిచయమైన పూజ (నజియా ఖాన్) తో ప్రేమలో పడతాడు. తన సమస్య తన స్నేహితుడైన రాంబాబు (జబర్దస్త్ ఫణి) కి తెలుసు. రాంబాబు హెల్ప్ తో ఆ సమస్యను ఎదుర్కోవడం కోసం చేసే ప్రయత్నం చాలా కామెడీగా చూపించారు. ఇంతకీ రవికి ఉన్న సమస్య ఏంటి? చివరికి సమస్యను అధిగమించాడా? లేదా? రవికి పూజ ఎలాంటి సపోర్ట్ ఇచ్చింది?
తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల :
అభిషేక్ పచ్చిపాల తనకున్న సమస్యని కామెడీగా చూపించడంలో మంచి నటనను కనబరిచారు. హీరోయిన్ నజియా ఖాన్ పెర్ఫార్మెన్స్ గ్లామరస్ గా చాలా బాగుంది. జబర్దస్త్ ఫణి ఫ్రెండ్ క్యారెక్టర్ లో కామెడీ మరి ఎమోషన్ ని చాలా బాగా పండించారు. సారిపల్లి సతీష్ గారు తండ్రి క్యారెక్టర్ లో అలాగే పోలీస్ పాత్రలు కామెడీని బాగా పండించారు. మిగిలిన పాత్రలు వారి పరిధి మేరకు వారు బాగా నటించారు.

టెక్నికల్ విశ్లేషణ :
రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్స్ మరియు సుధర్మ మూవీ మేకర్స్ సంయుక్తంగా తన్వీర్ మరియు ప్రకాష్ ధర్మపురి నిర్మాతలుగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చిత్రాన్ని నిర్మించారు. తన్వీర్ గారు నిర్మాత గానే కాకుండా లిరిక్ రైటర్ గా మరియు కథ, డైలాగ్స్ లో కూడా మంచి ప్రతిభ కనబరిచారు. ఎస్.కె. బాజీ అందించడం మ్యూజిక్ అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. యశ్వంత్ మొదటిసారి దర్శకత్వం చేస్తున్న మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న దర్శకుడిగా ఫ్రేమ్స్ మరియు టేకింగ్ లో చాలా బాగా దర్శకత్వం వహించాడు. దుర్గ నరసింహ ఎడిటింగ్ వర్క్ మరియు సమీర్ సినిమాటోగ్రఫీ పనితీరు మెప్పించాయి.

ఫైనల్ వర్డెక్ట్ :
ప్రస్తుత యువత తమ చెప్పుకోలేని సమస్యల్ని ఎలా ఎదుర్కొంటున్నారు అని దర్శకుడు ఈ సినిమాలో చాలా బాగా చూపించారు.

రేటింగ్ : 3/5

Previous article‘పేకమేడలు’ మూవీ రివ్యూ
Next articleప్రేక్షకుల ముందుకు రానున్న లేడీ డెడ్ పూల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here