అలనాటి కథానాయకుడు కత్తికాంతారావుగా సుపరిచితుడైన నటుడు కాంతారావు సతీమణి హైమావతి కన్నుమూశారు. ఒకప్పుడు గొప్పగా బతికిన ఆయన పలు సినిమాల్లో నటించి మెప్పించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌కు ధీటుగా వెండితెరపై వెలిగారు. కానీ కొన్ని సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నారు. ఆర్ధికంగా చితికిపోయారు. దీంతో కాంతారావు కుటుంబం ప్రభుత్వం ఇచ్చే పించన్‌ను ఆధారపడుతూ వచ్చింది.