భారత్ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఆరోగ్యంగా ఉన్నారు. శుక్రవారం ఛాతీనొప్పితో ఆసుపత్రిలోచేరిన కపిల్‌కు వైద్యులు యాంజియో ప్లాస్టీ చికిత్స చేశారు. రెండ్రోజుల్లో డిశ్చార్జి చేస్తారని ప్రకటించారు. ఇండియాకు తొలిసారి ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా కపిల్‌దేవ్ క్రీడాభిమానులు, భారతీయుల గుండెల్లో నిలిచారు. కిలోమీటర్ల వేగంతో కపిల్ సంధించే బంతులు బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపేవి. నాయకత్వంలోనూ కపిల్‌దంటూ ప్రత్యేకత ఉండేది. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న కపిల్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవటం. అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. ఇంతమంది అభిమానుల ప్రార్థనలతో తాను త్వరగా కోలుకున్నానంటూ సోషల్ మీడియా ద్వారా కపిల్ స్వయంగా అభినందనలు తెలిపారు.