మా ఎన్నికలకు నగారా మోగింది. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ ఆల్రెడీ రంగంలోకి దిగింది. తాజాగా ప్రెస్‌మీట్ పెట్టి మీడియా అతిని సున్నితంగా విమర్శించారు. మెగాకుటుంబాన్ని మీడియా ఎందుకిలా టార్గెట్ చేస్తుందనే అంశాన్ని కూడా పరోక్షంగా లేవనెత్తారు. నిన్నటి వరకూ ఇది హీరోల మధ్య సమరంగా అనిపించినా క్రమంగా తెలుగు సినిమాలో బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి పాతుకుపోయిన కుల సమీకరణలు ఒక్కసారిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రకాశ్ రాజ్ కన్నడ నటుడు.. దేశంలోని ప్రధాన భాషాచిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయంగా నరేంద్రమోదీపై విమర్శలు చేస్తూ కాంట్రవర్సీకు కేరాఫ్ చిరునామాగా మారారు. సెప్టెంబరులో తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటి వరకూ మెగా ఫ్యామిలీ మద్దతు ఇచ్చిన వారే అధ్యక్షులుగా ఎన్నికవుతూ వచ్చారు. తొలిసారిగా 2021 సెప్టెంబరులో జరిగే ఎన్నికలకు మెగా కుటుంబానికి ధీటుగా జీవితా రాజశేఖర్, మంచు విష్ణు ఇద్దరూ పోటీలో ఉన్నారు. మోహన్‌బాబు తనయుడు బరిలో ఉండటం.. గతంలో ఇద్దరి మధ్య విబేధాలు ఉండటంతో ఆసక్తిగా మారింది. ఇప్పటికే విష్ణు సూపర్‌స్టార్ కృష్ణ, బాలయ్య తదితరులను కలసి ఆశీస్సులు తీసుకున్నారు. వీరంతా కమ్మ వర్గానికి చెందిన వారు కావటంతో విష్ణుకు ఫుల్ సపోర్టుగా ఉంటారనే ఊహాగానాలున్నాయి .
కాపు వర్గానికి చెందిన మెగాస్టార్ బలపరిచే ప్రకాశ్‌రాజ్‌ను నాన్‌లోకల్‌గా ముద్రవేసే ప్రయత్నం చేశారు. దీనిపై కూడా మీడియా సమావేశంలో ప్రకాశ్‌రాజ్ ఘాటుగానే స్పందించారు. తెలంగాణలో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నపుడు రాని లోకల్ ఇప్పుడు గుర్తొచ్చిందా! అంటూ ప్రశ్నించారు. మీడియా కూడా అత్యుత్సాహం వదలుకోవాలని సూచించారు. దీనిపై మీడియా ప్రతినిధులు కాస్త అసహనం వ్యక్తంచేస్తే.. నిర్మాత, నటుడు గణేశ్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఏదో రకంగా ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌ను చులకన చేసి.. మీడియాలో చిత్రీకరించాలనే ఉద్దేశం అక్కడున్న కొందరి మీడియా ప్రతినిధుల్లో కనిపించింది. అయితే.. ప్రకాశ్‌రాజ్‌ను ప్రశ్నించిన వారిలో ఎవరూ కూడా ప్రధాన మీడియాకు సంబంధించిన వారు లేకపోవటమే దీనికి నిదర్శనం.. ఏమైనా మరోసారి.. మా ఎన్నికల సాక్షిగా కాపు వర్సెస్ కమ్మ వర్గ పోరు జరగనుందనేది మాత్రం వాస్తవం. ఇప్పటి వరకూ తమలో ఎన్ని ఉన్నా కలసి ఉన్నట్టుగా నటించిన నటీనటులు.. ఈ దఫా.. మీకు మీరే.. మాకు మేమే అనేంతగా మారటం ఖాయమనేది ప్రస్తుత పరిస్థితులు అద్దంపడుతున్నాయి.




కుల గజ్జి లేని విషయమేముంది..లేకపోతే ఆశ్చర్యం