యువ హీరో ఆయుష్ తేజస్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘కట్ట ప్రొడక్షన్ నెం.2’ ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై చిత్రానికి తొలి క్లాప్ ఇచ్చారు. అనంతరం చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
సీనియర్ నటుడు శరత్ బాబు కుమారుడు ఆయుష్ తేజస్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. కట్ట జే కథ, దర్శకత్వం వహిస్తుండగా.. ఆస్ట్రేలియాకు చెందిన సీహెచ్ దివ్య నిర్మిస్తున్నారు. నైనిషా రాయ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు కట్ట జే మాట్లాడుతూ.. తమ తొలి సినిమా కావడంతో ఎంతో ఆనందంగా ఉందని, ప్రేక్షకులు, మీడియా మద్దతు అందించాలని కోరారు. హీరో ఆయుష్ తేజస్ మాట్లాడుతూ.. కథపై తమకు పూర్తి నమ్మకం ఉందని, సినిమా మంచి విజయం సాధిస్తుందని అన్నారు.
హర్ష ప్రవీణ్ సంగీతం అందిస్తుండగా శంకర్ కేసరి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పి. సతీష్ కో-డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మంచి కథ, ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.
చిత్ర బృందం:
హీరో: ఆయుష్ తేజస్
హీరోయిన్: నైనిషా రాయ్
దర్శకత్వం: కట్ట జే
నిర్మాత: సీహెచ్ దివ్య
సంగీతం: హర్ష ప్రవీణ్
సినిమాటోగ్రఫీ: శంకర్ కేసరి
పీఆర్ & డిజిటల్: కలర్‌ఫుల్ డిజిటల్ మీడియా

