తెలంగాణ సీఎం కేసీఆర్ దత్త కుమార్తె ప్రత్యూష పెళ్లిపీటలు ఎక్కనున్నారు. నచ్చిన వరుడు వేలు పట్టుకుని జీవితాంతం నడవనున్నారు. గతంలో ఓ యువతిని మారుతల్లి పెట్టిన బాధ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు కూడా నమోదుచేశారు. ఆ యువతి చదువు, పెళ్లి బాధ్యతలు తానే చూస్తానంటూ అప్పట్లో సీఎం కేసీఆర్ చెప్పారు. తన దత్త పుత్రిక అని చెప్పారు. ప్రగతి భవన్‌లో ప్రత్యూషతో కలసి కేసీఆర్ దంపతులు భోజనం చేశారు. కొత్త బట్టలతో సత్కరించారు. ఆ యువతి బీఫార్మసీ పూర్తిచేసింది.. ఇటీవల తనకు నచ్చిన యువకుడితో పెళ్లి ప్రస్తావన తీసకువచ్చారు. దీంతో ఐసీడీఎస్ అధికారులు ప్రత్యూషను పెళ్లికూతురు చేశారు. మెహిందీ కార్యక్రమం నిర్వహించారు. సంప్రదాయబద్దంగా పెళ్లికూతురుగా ముస్తాబు చేశారు. ఈ నెల 28వ తేదీ.. అంటే. సోమవారం పెళ్లి జరగనుంది.



