టీడీపీ సీనియర్‌నేత, మాజీ శాసనస్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు మొదటి వర్థంతి. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో సంస్మరణ సభ నిర్వహించారు. నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమంలో ఉంచిన కోడెల చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పిచారు.
అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ కోడెల శివ ప్రసాదరావు తెలుగుదేశం పార్టీలో చేరిన నాటి నుండి సమాజానికి సేవ చేయాలన్న పడ్డ తపన, చేపట్టిన కార్యక్రమాలు ఆయనను చిరస్మరణీయునిగా మిగిల్చాయని గుర్తు చేసుకొన్నారు. నిబద్దత కలిగిన కార్యకర్తగా, నాయకునిగా తన నియోజకవర్గమే కాకుండా రాష్ట్రాభివృద్దిలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. క్యాన్సర్ హాస్పిటల్ స్థాపన లోనూ స్వర్గీయ డా. కోడెల శివ ప్రసాద రావు సేవలు చరిత్రలో నిలిచిపోతాయని, అటువంటి మహనీయుల ఆశయాలను కొనసాగించాల్సిన భాద్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. మొదటి వర్థంతి సందర్భంగా శ్రీ బాలకృష్ణ డా. కోడెల కుటుంభ సభ్యులకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన రోగులు, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ తదితర సిబ్బందికి శ్రీ నందమూరి బాలకృష్ణ అన్నదానం చేశారు.
కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, డా. ఆర్ వి ప్రభాకర రావు, డా. టియస్ రావు, మెడికల్ డైరెక్టర్, జి రవి కుమార్, డా. ఫణి కోటేశ్వర రావు, మెడికల్ సూపర్నింటెండెంట్, డా. కల్పనా రఘునాథ్, అసోసియేట్ డైరెక్టర్ అకడమిక్స్, సిహెచ్. సుమతి, పలువులు వైద్యులు, పారా మెడికల్, నర్సింగ్, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ తదితర వైద్యేతర సిబ్బంది పాల్గొన్నారు.


