అర్రే ఇదేదో వింతగా ఉందనుకునేరు.. ఇప్పుడిదే ట్రెండింగ్. సినీ, రాజకీయ నేతలను మించిన క్రేజ్ క్రికెటర్లదే. అప్పట్లో సచిన్.. తరువాత ధోని.. ఇప్పుడు.. విరాట్‌కోహ్లి. క్రికెట్‌లో ఒక సంచలనం.. ఆటతీరు.. నాయకత్వం అన్నీ కోహ్లిని విజేతగా నిలబెడుతున్నాయి. కాబట్టి.. కోహ్లికి సంబంధించిన ఏ విషయమైనా అబిమానులకు ఉత్సాహాన్ని ఇచ్చేవి. అందుకే.. కో అంటే కోటి మాత్రమే కాదు.. కోహ్లీ కూడా అని నిరూపించారు. అదెలా అంటారా.. అగస్టు 27 విరాట్-అనుష్కల జంట తాము వచ్చే ఏడాది జనవరి నాటికి ముగ్గురు కాబోతున్నట్టు ట్వీట్ చేశారు. అంతే.. ఆ జంటకు.. శుభాకాంక్షలు వెల్లువ మొదలైంది. ఈ పోస్టుకు ఇప్పటి వరకూ కోటి మంది వరకూ లైక్‌ల మీద లైకులు కొట్టారట. ఇది ఓ రకంగా.. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఇది సరికొత్త రికార్డుగా తేలిందట. 75 వేల మిలియన్ల మంది స్పందనతో ఆసియాలోనే కోహ్లీ జంట.. బాప్‌రే అనిపించారన్నమాట