చిరంజీవి సినిమా అంటే వివాదాలకు తెరలేపుతారు. మెగాఫ్యామిలీ పేరు చెబితే చాలు.. ఏవో కట్టుకథలు అల్లి రచ్చ చేయాలని చూస్తుంటారు. పవన్‌కళ్యాణ్ అంటే చాలు.. పేరు చెప్పి పాపులారిటీ సంపాదించుకునే వర్మలు.. శ్రీరెడ్డిలు ఎంతోమంది కనిపిస్తుంటారు. నిన్న సోషల్ మీడియాలో నాగబాబు గురించి చాలా దారుణంగా రాశాడో ప్రబుద్ధుడు. ఇవన్నీ మెగాఫ్యామిలీను దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు కుట్రగానే కొట్టిపారేస్తుంటారు. చిరంజీవిపై నోరుజారిన వర్మను వదిలేయమంటూ మెగాస్టార్ ఫ్యాన్స్ కు సూచించటం ఆయన పెద్దరికానికి నిదర్శనం. తాజాగా కొరటాల శివతో మెగాస్టార్‌కు ముఖ్యంగా రామ్‌చరణ్‌కు విబేధాలు వచ్చినట్టు పుకార్లు బయటకు వచ్చాయి. వీటిని కొండంత చూపుతూ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌లు కూడా మొదలయ్యాయి.
ఇవన్నీ ఒట్టి ట్రాష్ అంటూ దర్శకుడు కొరటాల శివ కొట్టిపారేశారు. ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య సినిమా షూటింగ్ చేస్తున్నారు. కరోనాతో కాస్త గ్యాప్ వచ్చినా ప్రోడక్షన్ పనులు మొదలయ్యాయట. అయితే ఇటీవల షూటింగ్‌లకు వెళ్లిన తారలకు వైరస్ సోకటంతో ఆచితూచి షూటింగ్ లు నిర్వహిస్తున్నారు. చిరంజీవి తరచూ ఆలస్యం చేయటం వల్ల కొరటాలకు కోపం వచ్చిందని.. రామ్‌చరణ్‌తో తీయాలనుకున్న సినిమా కూడా ఆగిపోయిందనే వార్తలు లేకపోలేదు. ఆచార్య సినిమా కథ తనదేనంటూ కూడా ఒక రచయిత రావటం కూడా మెగాఫ్యాన్స్‌ను ఆందోళనకు.. ఆవేదనకు గురిచేసింది. దీనికి సమాధానంగా కొరటాల ఇటీల ఒక ఇంటర్వ్యూలో ఇదంతా తప్పుడు ప్రచారమంటూ కొట్టిపారేశారు. చెర్రీతో కథ అనుకున్నమాట వాస్తవమే కానీ.. కథలో ఎక్కడో లోపం ఉందనేది నాకే అర్ధమైంది. దీంతో నాకు సరైన నమ్మకం లేదంటూ చెప్పాను. దానికి చరణ్ కూడా మీకు పూర్తి కాన్ఫిడెన్స్‌గా కథ ఉందనిపించినపుడు రండీ.. తప్పకుండా సినిమా చేద్దామంటూ లైట్ గా తీసుకున్నారంటూ కొరటాల చెప్పుకొచ్చారు. చిరంజీవి కుటుంబంతో తనకు మంచి సంబంధాలున్నాయన్నారు. సినిమాలు చేయకపోయినా మెగా ఇంట ఏ శుభకార్యం జరిగినా తాను ఉంటానంటూ చిరంజీవి కుటుంబంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.