కేటీఆర్ పరిచయం అక్కర్లేని నేత. మాటలతో లక్షలాది మందిలో ఉత్తేజాన్ని నింపగల నాయకత్వం. అదే సమయంలో ఒకే ఒక్క ట్వీట్‌తో ప్రాణాలు నిలుపుగల మానవత్వం. బంగారు తెలంగాణ సాధనలో మంత్రి కేటీఆర్ పంథా వేరు. రాజకీయాలకు అతీతంగా తాను చెప్పదలచుకున్నది చెప్పేస్తారు. ఐటీ రంగానికి చంద్రబాబు పునాది వేశారంటూ నిండు సభలో చెప్పారంటే ఆయనలోని పెద్దరికం తెలుస్తోంది. కరోనా సమయంలోనూ.. ఊరూవాడా.. రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు. అంతేనా.. ప్రజాసమస్యలపై నిత్యం అదికారులతో సమీక్ష జరుపుతున్నారు. మరోవైపు రాజకీయ సమీకరణలు చర్చిస్తూనే.. ఐటీ రంగంలో ఎగుమతులు పెంచేందుకు.. అమెజాన్, గూగుల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు నగరానికి క్యూ కట్టడంలో కేటీఆర్ చాతుర్యం అందరికీ తెలిసందే. ఇప్పుడు కరోనా కట్టడిలో మనమేం చేయాలనేందుకు తానే పెద్ద ఉదాహరణగా నిలిచారు. చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖానికి మాస్క్ ధరించేందుకు వెనుకాడుతున్నారు. మీడియాలో ఫేస్ కవర్ కాదనేది కూడా దీనిలో ఉన్నట్టుగా ఉంది. కానీ. కేటీఆర్ మాత్రం.. ఏడు నెలలుగా ముఖానికి మాస్క్ తప్పనిసరిగా ధరిస్తున్నారు. అంత వరకూ ఓకే.. అక్కడ కూడా చేనేత వస్త్రంతో తయారుచేసిన మాస్క్‌తో చేనేతకు ప్రచారం కూడా కల్పిస్తున్నారు. కేటీఆర్ ధరించే మాస్క్‌పై వేలాది మంది అడగటంతో కేటీఆర్ ట్వీట్‌తో స్పందించారు. చేనేత(హ్యాండ్లూమ్)తో తయారు చేసిన మాస్క్‌లు కావాలంటే.. ఆన్‌లైన్ ద్వారా టిస్కో వెబ్ సైట్ https://tsco.co.in/collections/handloom-face-masks కొనుగోలు చేయవచ్చని సూచించారు.