చంద్రబాబు తనయుడు. లోకేష్‌బాబు.. టీడీపీ జాతీయ నాయకుడు. ఎమ్మెల్సీ నుంచి మంత్రిగా వచ్చినా కేడర్‌లో గుర్తింపు తెచ్చుకునేందుకు అధికారం ఉపయోగపడింది. రెండేళ్లుగా ప్రతిపక్షంలో ఉంటూ.. కేడర్ ను దూరం చేసుకుంటూ ఉన్నారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో బొద్దుగా కనిపించే చినబాబు కసరత్తులు చేసి కండలు పెంచాడు. రూపం మార్చాడు… ఆకారాన్ని కాస్త గ్లామర్ గా మార్చుకున్నాడు. అంత వరకూ ఓకే.. ఇప్పుడు అలిపిరి వద్ద చేపట్టిన నిరసనలో రాయలసీమ యాసలోతాను సీమ బిడ్డనేనంటూ చెప్పే ప్రయత్నేం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఇప్పటికే అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అప్పట్లో అదికారంలో ఉన్న టీడీపీ నేత , సీఎం చంద్రబాబు దీని వెనుక ఉన్నారంటూ స్వయంగా అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపించారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. అదికారం తారుమారైంది.. జగన్ సీఎం పదవి చేపట్టి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ వివేకా కేసు ఒక్క అంగుళం కూడా కదల్లేదు.పైగా కేసులో విచారణ ఎదుర్కొంటున్న గంగిరెడ్డి, శ్రీనివాసరెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇదంతా జగన్ అండ్ కో ఆడుతున్న డ్రామాగా టీడీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 7న తిరుపతి ప్రచారంలో లోకేష్‌బాబు సవాల్ విసిరాడు. జగన్ వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసేందుకు వస్తారా! మీరు కానీ మీ కుటుంబం కానీ వెంకన్న సన్నిధికి వచ్చి ప్రమానం చేస్తారా అంటూసవాల్ చేశారు. అన్నట్టుగానే 14న అంటే. బుధవారం అలిపిరి వద్దకు చేరుకున్న లోకేష్ బాబు.. సీఎం జగన్ మోహన్‌రెడ్డి వస్తారా! అంటూ మరోసారి సవాల్ చేశారు. దీనికి కేంద్రంగా మారిన తిరుపతి రాయలసీమలో ఉంది. అందుకే.. తాను కూడా లోకల్ అనేలా.. చినబాబు సీమ యాసతో కొత్త ప్రయోగం చేశారు. మరి ఇది ఎంత వరకూ వర్కవుట్ అవుతుందనేది చూడాల్సిందే.