నిహారిక.. చైతన్య కలిపి.. నిశ్చయ్‌గా మారారు. మెగా ఇంటి అమ్మాయి జొన్నలగడ్డ వారింటి కోడలైంది. రాజస్తాన్ ఉదయ్‌పూర్‌లో అట్టహాసంగా జరిగిన మెగా వారసురాలు నిహారిక, చైతన్య వివాహం గురించి చర్చలే చర్చలు. మెగా అభిమానులే కాదు.. యావత్ తెలుగు ప్రజలు.. ఈ జంటను చూసి మురిసిపోయారు. నాగబాబు దంపతులు ఎంతగా ఆనందించారో.. చిరు ఫ్యాన్స్ అంతకుమించిన ఉద్వేగానికి గురయ్యారు. తమ ఇంటి ఆడపడచు పెళ్లిగా భావించి ఆశీర్వచనాలు అందజేశారు. వారం పది రోజులుగా.. నిహారిక పెళ్లికి సంబంధించిన వార్తలు.. ఫొటోలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ గా మారాయి.. మెహిందీ, సంగీత్ తదితర వేడుకల్లో చిరంజీవి దంపతులు చిందేయటం.. సరదాగా గడపటం.. నిహారిక పెళ్లిలో అన్నయ్యదే సందడంతా అనేంతగా మారింది. కొత్త దంపతులు అన్నవరం సత్యదేవుని ఆశీస్సులు తీసుకున్నారు. మొన్ననే అడుగులు నేర్చిన కూతురు.. ఇంతలోనే ఏడు అడుగులు వేసేంతగా ఎదగటాన్ని చూసిన తల్లి పద్మజ ఒకింత ఉద్వేగానికి గురయ్యానంటూ ఆమె స్వయంగా వెల్లడించారు. తన నిశ్చితార్దపు చీరలో నిహారికను చూసి కన్నీళ్లు ఆపులేకపోయానంటూ చెప్పారు. 2020లో అపురూపమై జంటగా. మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఎవరంటే.. ఖచ్చితంగా. నిహారిక, చైతన్యలే అంటున్నారు తెలుగు ప్రజలు.