కొందరు గురువులు కారణజన్ములు. బడి.. పిల్లల బాగోగులు మాత్రమే వారికి తెలిసేవి. చాలామంది ఉపాద్యాయ వృత్తి పార్ట్‌టైమ్‌గా భావిస్తుంటారు. ఇంటి వద్ద ఖాళీగా ఉన్నాం.. ఎలాగూ సర్కారు కొలువు అనే దారిలోనే వచ్చిపోతుంటారు. కొందరైతే చీటిపాటలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, సంఘాల్లో బిజీగా మారి.. పిల్లలకు చదువుచెప్పటం కూడా మరచిపోయారు. వాళ్లందరికీ కనువిప్పు కలిగించేలా.. ఓ ఉపాద్యాయురాలు స్పూర్తిగా నిలుస్తున్నారు. అందుకే. ఆమెను కేంద్రం ప్రభుత్వం జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సత్కరించబోతుంది. సెప్టెంబరు 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం వేళ యావత్ దేశవ్యాప్తంఆ 24 మంది జాతీయస్థాయికి ఎంపికైతే.. వారిలో హైదరాబాద్ జిల్లా మలక్‌పేట్ ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో గణితం బోధించే ఉపాధ్యాయిని
పద్మప్రియ కూడా ఉన్నారు. ఇది ఆమె కష్టానికే కాదు.. గొప్పగా భావించే బోధనా వృత్తికి తగిన గౌరవంగా ఉపాద్యాయవర్గం భావిస్తుంది. హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్వయంగా పద్మప్రియను సత్కరించారు. ఉపాద్యాయ సంఘాలు కూడా పద్మప్రియ దంపతులకు శాలువాతో గౌరవించారు.
వుమ్మాజీ పద్మప్రియ 1996లో సెకండరీగ్రేడ్ టీచర్‌గా ఎంపికయ్యారు. 1999లో ఏపీపీఎస్సీ పరీక్ష రాసి స్కూల్ అసిస్టెంట్‌గా కొలువు సంపాదించారు. తాను ఎక్కడ పనిచేసినా విద్యార్థుల్లో గణితం పట్ల భయం పొగొట్టడమే లక్ష్యంగా బోధన చేసేవారు. పిల్లలంటే ఆప్యాయత.. ఏ నాడూ కోపగించుకోపోవటం చేసేవారు. పేద, మధ్యతరగతి పిల్లలు అధికంగా వచ్చే ప్రభుత్వ పాఠశాలల్లో తెలివైన.. మట్టిలో మాణిక్యాలను వెతికేవారు. వారికి శిక్షణనిచ్చి చదువుపట్ల ఆసక్తినే కాదు.. మరింత ప్రావీణ్యం సంపాదించేందుకు కృషిచేసేవారు. ఆమె ఎక్కడ బాధ్యతలు చేపట్టినా. గణితంలో 94శాతం పాస్ ఉండేది. నాలుగేళ్లుగా 100 శాతం ఉత్తీర్ణత సాధించటం ఆమె ఎంతగా శ్రమిస్తున్నారు.. పిల్లలకు అర్ధమయ్యేలా ఎలా బోధిస్తున్నారనేందుకు నిదర్శనం.
టీచర్స్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా 2016లో భారత్ నుంచి అమెరికాకు ఏడుగరు ఉపాధ్యాయులు వెళ్లారు. వారిలో పద్మప్రియ కూడా ఉండటం.. ఆమె సమర్థతకు నిలువెత్తు నిదర్శనం. అమెరికాలో స్కైప్ ద్వారా విద్యాబోధన చేశారు. చాలామంది విద్యార్థులు అమ్మో లెక్కలా! అని భయపడతారు. అటువంటి వారికి లెక్కలంటే భయం పొగడతానంటారామె. అమెరికా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులను రప్పించి.. ఇక్కడి విద్యార్థులకు గణితం చెప్పించారు. వారి ద్వారా కంప్యూటర్, ప్రాజెక్టుర్‌కు విరాళం కూడా ఇప్పించగలిగారు. ఏదైనా.. విజయం సాధించటం అంటే.. వ్యక్తిగతంగా లబ్దిపొందటమే కాదు.. సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో అడుగులే వేసే ఎవరైనా విజేతలుగా నిలుస్తారని ఆమె నిరూపించారు. ఇదంతా సమిష్టిగా సాధించిన విజయమంగా పద్మప్రియ చెబుతుంటారు.