మెగా హీరో సాయిధరమ్ తేజ్ హ్యాట్రిక్ హిట్ కొట్టారు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా రేయ్‌తో తెరంగేట్రం చేసిన సాయి క్రమంగా తనను తాను నిరూపించుకోవాలనే సంకల్పంతో ప్రయత్నించాడు. మొదట్లో కాస్త తడబడ్డాడు. తిక్క, ఇంటెల్జెంట్, విన్నర్, జవాన్ ఐదారు సినిమాలు అట్టర్‌ప్లాప్ అయ్యాయి. సుప్రీమ్ తో మాంచి హిట్టు కొట్టినా మళ్లీ ప్లాప్‌ల బాట పట్టాడు. దీంతో చిరంజీవి కలుగజేసేకుని కథల ఎంపిక.. దర్శకుల గురించి కసరత్తు చేశారట. మేనల్లుడు ట్రాక్‌లో పడేందుకు బాటలు వేశాడంట. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా విజయం సాధించవచ్చంటూ మెగా స్టార్ మేనల్లుడికి సున్నితంగా మందలించారట. దీంతో చిత్రలహరి, ప్రతిరోజూ పండుగే సినిమాలలో గొప్ప నటన చూపి సాయి మెగా వారసుడుగా సత్తా చాటాడు. సోలో బతుకే సో బెటర్ అంటూ.. పది నెలలుగా ఊరిస్తూ.. క్రిస్మస్ కానుకగా 25న థియేటర్లలో కనిపించాడు. పది నెలలుగా సినిమా థియేటర్ల వైపు అడుగులు వేయని ప్రేక్షకులు మెగా హీరో సినిమాకు పరుగులు తీశారు.మొదటి షో పర్వాలేదని టాక్ వచ్చినా.. క్రమంగా సినిమా సూపర్ హిట్ టాక్‌తో రెండోరోజు కూడా మంచి కలెక్షన్లు కురిపిస్తుందట. వరుసగా సెలవులు రావటంతో సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్లు కూడా బాగానే చేస్తుందనే సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.




