మెగా హీరో సాయి థరమ్ తేజ్ సినిమా సోలో బతుకే సోబెటర్ త్వరలో రాబోతుందంటూ తానే స్వయంగా ట్వీట్ చేశాడు. కరోనా ఇబ్బందులు లేకపోతే ఏ నాడో థియేటర్లలో విడుదల కావాల్సిన సినిమా. కానీ.. లాక్‌డౌన్ ఆంక్షలతో బ్రేక్ పడింది. అయితే.. ఇప్పట్లో థియేటర్లు ప్రారంభించే అవకాశం లేకపోవటంతో ఓటీటీలో విడుదల చేస్తారనే అనుకున్నారు. ఎందుకంటే.. ఇటీవల వి, నిశ్చబ్దం వంటి స్టార్ సినిమాలు కూడా ఓటీటీలోనే ప్రేక్షకులు చూడాల్సి వచ్చింది. కాబట్టి ఇదే దారిలో సోలో బతుకే సో బెటర్ కూడా విడుదల చేస్తారని భావించారు. కానీ సాయి మాత్రం థియేటర్లలోనా.. ఓటీటీ లోనా అనేది అతి త్వరలో అంటూ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. వరుస ప్లాప్‌లతో ఇబ్బందిపడిన సాయిధరమ్ తేజ్ చిత్రలహరి, ప్రతిరోజూ పండుగేతో ట్రాక్‌లోకి వచ్చారు. మంచి కథలు ఎంచుకుని తనదైన నటనతో ఆకట్టుకుంటున్నారు. సోలో బతుకే సో బెటర్‌తో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.



