చేపల పులుసు ఎలా పెట్టాలో చెబుతాడు. దోసెలు బాగా చేసిపెడతాడు.. మెగాస్టార్ చిరంజీవి గురించి కొందరు పనిగట్టుకుని చేసిన అవాకులు. చవాకులు. నిజమే.. ఇంటికొచ్చిన అతిథికి ఆత్మీయంగా భో్జనం పెట్టగల గొప్ప మనసు. ఇప్పటికీ చిన్ననాటి స్నేహితులను కలసినపుడు దోసె తినండ్రా అంటూ పంచగల మనసున్న నేస్తం. రెండు దశాబ్దాల క్రితమే.. ప్రాణాపాయంలో ఉన్నవాళ్లకు రక్తం ఎంత అవసరమో గుర్తించి బ్లడ్‌బ్యాంకు.. మరణించిన తరువాత మట్టిలో కలిసే కళ్లను తిరిగి బతికించేందుకు ఐ డోనేషన్‌పై అవగాహన కల్పించిన హీరో మెగాస్టార్ మాత్రమే. ఎవరెన్ని అన్నా.. రక్తం అమ్ముకుంటున్నాడంటూ కారుకూతలు కూసినా.. ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు పక్కన చేరి వెన్నుపోటు పొడిచిన ఇంటిదొంగలను క్షమించే గొప్పతనం మెగా వ్యక్తిత్వం. అందాకా.. ఎందుకు.. ప్రజారాజ్యం పార్టీలో తనను ఘోరంగా దెబ్బతీసిన ఓ నేతకు కరోనా వస్తే.. అపోలో వైద్యులతో మాట్లాడి నా తమ్ముడ్ని కాపాడమంటూ చెప్పిన శిఖరం చిరంజీవి. అయినా.. వాళ్లకు ఆ నోళ్లకు చిరంజీవిని తిట్టాలి. ఆక్సిజన్ పంపిణీ చేసినపుడు కూడా.. అబ్బే టైం దాటాక పనిచేస్తున్నాడు. ఆక్సిజన్ వ్యాపారం చేస్తున్నాడంటూ ఎందరో కారుకూతలు కూస్తూ.. చిరంజీవినే కాదు.. మెగా అభిమానులనూ అవమాన పరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇవన్నీ.. చిరంజీవి వంటి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయలేవని గుర్తించాలి. ప్రజారాజ్యం పార్టీ ఆఫీసులో చేరి.. చిరంజీవి గురించి చెడ్డ ప్రచారం చేసిన వ్యక్తులు మళ్లీ.. అన్నయ్యకు జైజేలు కొడుతున్నారు. ఇదంతా వారిలో మార్పా.. లేకపోతే మరోసారి వెన్నుపోటుకు సిద్ధమయ్యారా! అంటే దానికి కాలమే సమాధానం చెబుతుంది. ఎందుకంటే.. మెగాస్టార్ చిరంజీవి కల్లాకపటం తెలియని మానవతా వాది.. ఆకాశంపై ఉమ్మి వేస్తే తిరిగి వారి ముఖానే పడుతుందనేది చిరంజీవి విషయంలోనూ అదే జరుగుతుందని గుర్తించాలి. ఇప్పటికైనా నోళ్లకు కళ్లెం వేయకపోతే.. జనం ముందు అభాసు పాలవుతారనేది తెలుసుకోవాలి.
నది గమనం సముద్రం వైపే..దానిలో మురుగు కాలువ కలుస్తుందా, మంచి సెలయేరు కలుస్తుందా, బట్టలుతుకుతున్నారా, చేపలు పడుతున్నారా లేదా సూర్యునికి ఆచమనం సమర్పిస్తున్నారా ఇవేవీ నదికి పట్టవు అలాగే సద్గుణులు వారి పని వారిదే.. మెచ్చుకునేవాడు మెచ్చుకుంటాడు..తిట్టుకునేవాడు విమర్శించేవాడు బురదజల్లెవాళ్ళు ఎలాగూ ముందు వరుసలోనే వుంటారు..దేవుడ్ని కూడా అందరూ మెచ్చుకోరు…అలాంటపుడు మానవులెంత…చిరంజీవ సుఖీభవ