ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో ఇదే టాపిక్. అకస్మాత్తుగా చిరంజీవిని రాజకీయ తెరపైకి తీసుకొచ్చిన జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఒక సస్పెన్స్‌కు పునాది వేశారు. పునాదిరాళ్లతో వెండితెర ఇలవేల్పుగా మారిన చిరంజీవి మరోసారి ప్రత్యర్థి పార్టీల పునాదులు కదుపుతారంటూ హింట్ ఇచ్చారు. 2009లో ప్రజారాజ్యం పార్టీతో చిరంజీవికి జనం బ్రహ్మరథం పట్టినా వాటిని ఓటు బ్యాంకుగా మలచుకునే వ్యూహప్రతివ్యూహాలు లేకుండా పోయాయి. అప్పటికే రాజకీయంగా ఢక్కామొక్కీలు తిన్న చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వంటి సీనియర్లను ఎలా ఢీకొట్టాలనేది అంచనా వేయలేకపోయారు. కేవలం మెగా అభిమానులు.. తన చరిష్మా మాత్రమే పనిచేస్తుందనే ఆలోచనతో చిరంజీవి రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలను పన్నటంలో విఫలమయ్యారు. ఫలితంగా కోట్లాది మంది గుండెల్లో చిరంజీవిగా ఉన్నా ఎందుకో రాజకీయాల్లో పరాజితుడుగా వైదొలిగారు. ఇది 2021 రాజకీయంగా చిరు.. గల్లీ నుంచి ఢిల్లీ రాజకీయాలను గమనించారు. జనసేనానిగా తమ్ముడు ఇప్పుడు మరింత రాటుతేలాడు. వరుస హిట్లతో మళ్లీ వెండితెరపై మెగాస్టారే నెంబర్ వన్ అనిపించుకుంటున్నారు. ఇంతటి చరిష్మాను ఇప్పుడు తక్కువగా చూడలేం. పైగా అభిమానులు, పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయం ఉంది. పవన్ కళ్యాణ్ సేనానిగా జనంలో పాజిటివ్‌గా ఉన్నారు. ఇటువంటి సమయంలోనే చిరంజీవిని.. బీజేపీ తమ పార్టీలోకి ఆహ్వానించాలని ప్రయత్నిస్తోంది. ఎలాగూ సేనతో పొత్తు ఉంది కాబట్టి.. జనసేనకూ చిరు బలంగా మారతారనే అంచనాలున్నాయి. అయితే.. ప్రత్యర్థులకు మాత్రం.. అన్నదమ్ముల కలయికతో తమ రాజకీయ పునాదులు కదులుతాయనే ఆందోళన కూడా లేకపోలేదు. అందుకే.. కాపు కులాన్ని మరోసారి తెరమీదకు తీసుకొచ్చి ఓటు బ్యాంకు చీల్చాలనే ప్రయత్నం మొదలుపెట్టారు. కానీ.. ఇంతకీ చిరు.. కమలం గూటికి వెళతారా.. తమ్ముడి వెన్నంటి కొనసాగుతారా అనేది మాత్రం సస్పెన్స్‌గా మిగిల్చారు.
గ్లాస్ అయినా, కషాయం, ఎరుపైనా పర్వాలేదు గాని
తాను పార్టీ పెట్టినప్పుడు కోవర్టులను పార్టీ లోకి పంపి, టిక్కెట్లు , బ్లడ్ అమ్ముకుంటున్నారని, చిరు కుటుంబాన్ని కూడా వదలకుండా బురదజల్లిన రంగు అయితే మాత్రము గతాన్ని మర్చిపోయినట్లే….