ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ (ఐఓఈ) హోదా అందుకునేందుకు భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందాన్ని ఓ.పీ జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీ (జెజీయు) చేసుకుంది.
జెజీయుకు ఇది చారిత్రాత్మక గుర్తింపు. ఐఓఈ నిబంధనలకు అనుగుణంగా అన్ని చట్టపరమైన, నియంత్రణ మరియు విధానపరమైన అవసరాలన్నీ కూడా జెజీయు అనుసరించింది. తద్వారా జెజీయు ఇప్పుడు ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ (ఐఓఈ)గా కార్యకలాపాలు నిర్వహించనుంది. ప్రపంచస్థాయి బోధన మరియు పరిశోధనా సంస్ధలుగా మారడానికి విశ్వ విద్యాలయాలు మరియు ఉన్నత విద్యా సంస్థలను శక్తివంతం చేయడంలో భారతప్రభుత్వ నిబద్ధతను అమలు చేసేందుకు ఈ ఐఓఈ విధానాన్ని ప్రారంభించారు. ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ ఎంపిక మరియు సిఫార్సు బాధ్యతను నిపుణుల కమిటీకి అప్పగించారు. ఈ కమిటీని గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నియమిస్తారు.
ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెస్స్ హోదాతో, జెజీయు ఇప్పుడు దేశంలోని ప్రతిష్టాత్మక 10 ప్రైవేట్ ఇనిస్టిట్యూషన్‌ల బృందంలో ప్రవేశించడంతో పాటుగా నియంత్రణ పరిధిలకు ఆవల పూర్తి స్వతంత్య్ర ప్రతిపత్తిని ఆస్వాదిస్తుంది. ప్రైవేట్ ఇనిస్టిట్యూషన్‌ల కోసం యుజీసీ (ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెస్స్ డీమ్డ్ టు బీ యూనివర్శిటీస్) రెగ్యులేషన్స్ 2017 మరియు పబ్లిక్ ఇనిస్టిట్యూషన్‌ల కోసం యుజీసీ (డిక్లరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ యాజ్ ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్) మార్గదర్శకాలు 2017 పరిచయం తరువాత ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ కోసం వెదుకులాట 2017వ సంవత్సరంలో ఆరంభమైంది.
ఈ చారిత్రాత్మక సందర్భంగా వ్యవస్థాపక ఛాన్స్‌లర్ మరియు ఓ.పీ జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీ శ్రేయోభిలాషి శ్రీ నవీన్ జిందాల్ మాట్లాడుతూ ‘‘ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్‌గా హోదాను జెజీయు అందుకోవడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. జెజీయుకు ఇది అసాధారణ గుర్తింపు మరియు విశ్వవిద్యాలయం సాధించిన అసాధారణ విజయాలకు మహోన్నత నివాళి ఇది. జెజీయును మా తండ్రి శ్రీ ఓ.పీ జిందాల్ స్మృత్యర్థం ఏర్పాటుచేశాము. విద్య, వ్యవస్ధాపకత, దాతృత్వం మరియు జాతి నిర్మాణం పట్ల అపారమైన నమ్మకం కలిగిన వ్యక్తి ఆయన. మనం నివశిస్తున్న కమ్యూనిటీలలో అసలైన మార్పును తీసుకువచ్చే అసాధారణ నాయకులను తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం. ఉపకులపతి, ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు జెజీయు సిబ్బందిని నేను అభినందిస్తున్నాను. వారి నిబద్ధత, కష్టం, అంకితభావం కారణంగానే ఈ అద్భుతమైన గుర్తింపు, విశ్వవిద్యాలయం ఆరంభించిన 10 సంవత్సరాల లోపుగానే సొంతమయింది. ప్రపంచ శ్రేణి విశ్వవిద్యాలయంగా మా ప్రయాణంలో, మేము అన్ని వేళలా జెజీయును పూర్తి స్థాయి వనరులు, విద్యా స్వేచ్ఛ, స్వతంత్య్ర హోదా పొంది ఉండేలా తగు చర్యలు తీసుకున్నాం. అది జెజీయు మరింతగా ముందుకు పోయేందుకు సహాయపడింది. ప్రస్తుతం మేము అందుకున్న హోదా, అంతర్జాతీయ వేదికపై అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఇనిస్టిట్యూషన్‌గా నిలువడంలో సహాయపడనుందనే విశ్వాసంతో ఉన్నాను’’ అని అన్నారు.
అక్టోబర్ 2020లో, ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ కు సంబంధించి ఓ సమీక్షా సమావేశం భారత విద్యాశాఖామాత్యులు శ్రీ రమేష్ పొఖ్రియాల్ నిషాంక్ అధ్యక్షతన జరిగింది. దీనిని అనుసరించి జెజీయు అధికారికంగా భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖ నుంచి ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ (ఐఓఈ) హోదాను అందుకున్నట్లుగా లేఖను అందుకుంది. ఈ ఎంఓయుపై సంతకాన్ని అక్టోబర్29,2020వ తేదీన భారత ప్రభుత్వ విద్యాశాఖామాత్యులు చేశారు.
ప్రొఫెసర్ (డాక్టర్) సీ. రాజ్‌కుమార్, వ్యవస్థాపక ఉప కులపతి – ఓ.పీ.జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీ మాట్లాడుతూ ‘‘జెజీయు చరిత్రలో నేడు సువర్ణాక్షరాలతో లిఖించే రోజు. జెజీయుకు ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ హోదాను కట్టబెట్టడం వల్ల మేము భారతదేశపు సొంత ఐవీ లీగ్ సమానమైన టాప్ 10 పబ్లిక్ మరియు టాప్ 10 ప్రైవేట్ ఇనిస్టిట్యూషన్‌ల జాబితాలో ప్రవేశించాము. అందువల్ల, జెజీయు ఇప్పుడు చాలా వరకూ నియంత్రణ పరిమితుల నుంచి బయటకు రావడంతో పాటుగా పూర్తి స్వతంత్య్ర ప్రతిపత్తిని అనుభవిస్తుంది. 2009లో జెజీయును ఏర్పాటుచేసినప్పుడు, మా లక్ష్యం చాలా సరళంగా ఉంది ః భారతదేశంలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం నిర్మించడమే అప్పట్లో మా లక్ష్యం. వాస్తవమేమిటంటే, దశాబ్దంలోనే మేము ఈ గుర్తింపును అందుకోవడం ద్వారా మా విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు మరియు జెజీయు సిబ్బంది అందించిన అసాధారణ తోడ్పాటు గురించి పుంఖానుపుంఖాలుగా వెల్లడిస్తుంది. శ్రేష్టతను అందుకోవాలనేది మా కోరిక. అదే సమయంలో అంతర్జాతీయంగా అత్యున్నత ఇనిస్టిట్యూషన్‌ల తో సమానంగా జెజీయు నిలిచింది. మా ఫౌండింగ్ ఛాన్స్‌లర్ శ్రీ నవీన్ జిందాల్, భారతీయ దాతృత్వం పరంగా అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌ను జెజీయు ఏర్పాటుచేయడం ద్వారా రూపొందించారు మరియు అతి స్వల్పకాలంలో శ్రేష్టత పరంగా మహోన్నత శిఖరాలను అధిరోహించారు. ఉన్నత విద్యలో దాతృత్వం ప్రోత్సహించేందుకు రూపాంతర నాయకత్వం ప్రోత్సహించిన ఆయనకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం’’ అని అన్నారు.
అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో జెజీయు యొక్క బలీయమైన ఉనికిని గురించి ప్రొఫెసర్ సీ . రాజ్‌కుమార్ మాట్లాడుతూ ‘‘ క్యుఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్‌లో మూడు స్థాయిలు – ఆసియా ర్యాంకింగ్స్, బ్రిక్స్ ర్యాకింగ్స్ మరియు వరల్డ్ ర్యాంకింగ్స్‌లో జెజీయు నిలిచింది. తాజా క్యుఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్‌లో భారతదేశపు నెంబర్ 1 ర్యాంక్‌ను ప్రైవేట్ విశ్వవిద్యాలయాల జాబితాలో పొందింది మరియు తాజా క్యుఎస్ వరల్డ్ యంగ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోనే టాప్ 150 ర్యాంకులలో నిలిచింది. అయితే, సొంత దేశంలో మేము సాధించిన ఉన్నతికి తగిన గుర్తింపు పొందాలనేది మా లక్ష్యం. అది మేము ఇప్పుడు సాధించగలిగాం. రాబోయే సంవత్సరాలలో మరింతగా మేము సాధించేందుకు ఇది మాకు తోడ్పడనుంది. ఈ గుర్తింపు మాకు స్ఫూర్తిదాయకంగా ఉండటమే కాదు అభ్యాసం మరియు విజ్ఞాన సృష్టి పరంగా జెజీయు నూతన శిఖరాలను చేరుకోవడాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది మరియు భారతీయ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా శ్రేష్టత కోసం సరికొత్త ప్రమాణాలనూ సృష్టించనుంది’’ అని అన్నారు.
ప్రైవేట్ ఇనిస్టిట్యూషన్‌ల కోసం యుజీసీ (ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెస్స్ డీమ్డ్ టు బీ యూనివర్శిటీస్) రెగ్యులేషన్స్ 2017 మరియు పబ్లిక్ ఇనిస్టిట్యూషన్‌ల కోసం యుజీసీ (డిక్లరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ యాజ్ ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్) మార్గదర్శకాలు 2017 పరిచయం తరువాత ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ కోసం వెదుకులాట 2017వ సంవత్సరంలో ఆరంభమైంది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్‌కు 10 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మరియు 10 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసే బాధ్యతను కట్టబెట్టారు. భారతీయ ఉన్నత విద్యకు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకువచ్చే రీతిలో అవి ఉండాలి. ఈ ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ యొక్క ప్రధాన లక్ష్యం, కొద్ది సంవత్సరాలలోనే ప్రపంచశ్రేణి హోదాను సొంతం చేసుకోవడం. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యుజీసీ) 100కు పైగా దరఖాస్తులను పలు విద్యాసంస్థల నుంచి దేశవ్యాప్తంగా పొందింది. మానవవనరుల అభివృద్ధి శాఖ యొక్క ప్రతిష్టాత్మక 20 ప్రపంచశ్రేణి ఇనిస్టిట్యూషన్స్ ప్రాజెక్ట్స్ కోసం డిసెంబర్ 2017 నాటికి ఈ దరఖాస్తులు అందుకోవడం జరిగింది. నియమించబడిన నిష్ణాతుల బృందం మొత్తంమ్మీద 114 దరఖాస్తులను పరిశీలించింది. వీటిలో పబ్లిక్ ఇనిస్టిట్యూషన్‌లు 74 కాగా ప్రైవేట్ ఇనిస్టిట్యూషన్‌లు 40. వీటిలో ఇంకా మొదలుకాని ఇనిస్టిట్యూట్‌లు కూడా ఉన్నాయి (గ్రీన్‌ఫీల్డ్ విభాగం). పరిశీలనల తరువాత ఎనిమిది పబ్లిక్ ఇనిస్టిట్యూషన్‌లు మరియు మూడు ప్రైవేట్ ఇనిస్టిట్యూట్‌లను ఎంపిక చేశారు. అనంతర కాలంలో మరింతగా పరిశోధించి మరో 19 ఇనిస్టిట్యూషన్‌లను సూచిస్తారు.
ప్రొఫెసర్ దబిరు శ్రీధర్ పట్నాయక్, రిజిస్ట్రార్, జెజీయు మాట్లాడుతూ ‘‘భారతదేశంలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం సృష్టించాలనే లక్ష్యంతో పాటుగా అంతర్జాతీయ నాయకులను సృష్టించాలనే జెజీయు ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్‌గా గుర్తించబడటం అనేది అతి ముఖ్యమైనమైలురాయి. తద్వారా భారతీయ ఉన్నత విద్యను అంతర్జాతీయంగా విస్తరించాలనే మా లక్ష్యం మరింతగా చేరువకాగలం. ఈ నిర్థిష్టమైన ప్రాజెక్టు మూడు సంవత్సరాల ప్రాజెక్టు. అది ఇప్పుడు భారతప్రభుత్వం నుంచి జెజీయుకు అత్యున్నతమైన ఐఓఈ హోదా పొందడంతో ఉన్నత స్థాయికి చేరింది. విద్యారంగంలో శ్రేష్టతను చేరుకోవాలనుకునే మా నిబద్ధతకు గుర్తింపు. దశాబ్ద కాలపు మా ప్రయాణం నేడు 10 ఇంటర్ డిసిప్లీనరీ స్కూల్స్‌గా మారడంతో పాటుగా 6500 మంది విద్యార్ధులు, 730 ఫుల్‌టైమ్ ఫ్యాకల్టీ సభ్యులతో నిలిచింది’’ అని అన్నారు.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ర్యాంకింగ్స్‌లో నిలిచిన టాప్ 50లో స్థానం సంపాదించిన ఇనిస్టిట్యూట్‌లు లేదా నిర్థిష్టమైన అంతర్జాతీయ రేటింగ్స్‌లో టాప్ 500లో నిలిచిన సంస్థలు దరఖాస్తు చేసేందుకు అర్హత కలిగి ఉంటాయి. అయితే, కేవలం 10 పబ్లిక్ మరియు 10 ప్రైవేట్ ఇనిస్టిట్యూట్‌లు మాత్రమే ఎంపిక చేస్తారు. పబ్లిక్ యూనివర్శిటీలకు ఆర్థిక మద్దతును ప్రభుత్వం అందిస్తే, ప్రైవేట్ ఇనిస్టిట్యూట్‌లకు మాత్రం ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్‌గా ప్రతిపాదిస్తారు. వీరికి ఆర్థిక మద్దతు ఉండదు కానీ ప్రత్యేక విభాగపు డీమ్డ్ యూనివర్శిటీగా వారికి మరింత స్వతంత్య్ర ప్రతిపత్తిని అందిస్తారు.
ఓ.పీ జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీ గురించి ః
ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ (ఐఓఈ)గా భారతప్రభుత్వం జెజీయును గుర్తించింది. ఐఓఈగా గుర్తింపు పొందిన ఒకే ఒక్క నాన్ స్టెమ్ మరియు నాన్ మెడిసన్ యూనివర్శిటీ జెజీయు. 2009లో ప్రారంభమైన ఓ.పీ. జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీ (జెజీయు) లాభాపేక్ష లేని అంతర్జాతీయ మరియు పరిశోధనాధారిత విశ్వవిద్యాలయం. హర్యానా ప్రభుత్వం మద్దతునందిస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజీసీ) గుర్తింపు ఉంది. జెజీయు ఇప్పుడు 1ః9 ఫ్యాకల్టీ, స్టూడెంట్ రేషియోను నిర్వహిస్తుంది. భారతదేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల నుంచి ఫ్యాకల్టీని అసాధారణ అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తుంది. 5వేల మందికి పైగా విద్యార్థులు మరియు 550కు ఫ్యాకల్టీతో పూర్తి రెసిడెన్షియల్ క్యాంపస్‌లో ఇక్కడ విద్యను అందిస్తున్నారు. జెజీయు యొక్క తొమ్మిది స్కూల్స్ ః లా, బిజినెస్, ఇంటర్నేషనల్ ఎఫైర్స్, పబ్లిక్ పాలసీ , లిబరల్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్, జర్నలిజం, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ మరియు ఎన్విరాన్‌మెంట్ అండ్ సస్టెయినబిలిటీ. ఈ సంవత్సరం భారతదేశంతో పాటుగా అంతర్జాతీయంగా క్యుఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2020లో నిలిచిన అతి పిన్న యూనివర్శిటీగా జెజీయు నిలిచింది. అంతర్జాతీయంగా టాప్ 150 యంగ్ యూనివర్శిటీ(50 ఏళ్ల లోపు యూనివర్శిటీ)లలో నిలిచిన ఒకే ఒక్క భారతీయ ప్రైవేట్ యూనివర్శిటీ జెజీయు. జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఫౌండేషన్ యొక్క కార్యక్రమం జెజీయు.