బీజేపీ ఎంపీ వై.సుజనాచౌదరికి ఊహించని షాక్ ఎదురైంది. అమెరికా వెళ్లేందుకు సిద్దమైన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికా వెళ్లేందుకు సుజనాచౌదరి విమానాశ్రయం వెళ్లారు. బ్యాంకు కుంభకోణం కేసులో ఆయనపై లుకౌట్ నోటీసు జారీచేయటంతో ఇమిగ్రేషన్ అధికారులు స్టాపిట్ అన్నారు. అంతే హఠాత్ పరిణామానికి ఉలికిపాటుకు గురైన సుజనా అధికారుల మీద అగ్గిమీద గుగ్గిలమైనట్టు సమాచారం. దీనిపై సుజనాచౌదరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనను ఆక్రమంగా అడ్డుకున్నారని.. లుకౌట్ నోటీసులు రద్దు చేయాలంటూ పేర్కొన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 322 కోట్లరూపాయలకు పైగా ఎగవేత దారుడుగా ఆయనకు నోటీసులు జారీచేశారు. సుజనాకు సంబంధించిన 102 కంపెనీలను చూపుతూ వివిధ బ్యాంకుల్లో సుమారు సుమారు రూ.8000 కోట్లకు పైగా రుణాలు తీసుకున్నారు. అయితే ఈ ఆస్తుల విలువ రూ.
100 కోట్లు కూడా ఉండవని సమాచారం.