గత నెల 12 న విశాఖ తీరం లోని తెన్నేటి పార్కుకి కొట్టుకొచ్చిన బాంగ్లాదేశ్ వాణిజ్య నౌక MV-Maa కి మరమత్తులు జరిపి తిరిగి పంపించే ప్రయత్నం విరమించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే దీన్ని సరిచేసి సముద్రంలో ప్రయాణింపచేయటం సాధ్యం కాదని నిపుణులు తేల్చేశారు.అయితే, దీన్ని పర్యాటక శాఖకి అప్పగించి తెన్నేటి పార్కుకి అదనపు ఆకర్షణగా మార్చాలని ప్రభుత్వం భావిస్తుంది. దీని విలువ 300 కోట్లు ఉండవచ్చు. ఇందులో ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని పర్యాటక శాఖ బావిస్తోంది.