ఇటీవల కన్నుమూసిన తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. అయన సతీమణి అహల్య కూడా (67) అనారోగ్య కారణంతో ఈరోజు మృతి చెందారు. నాయిని నర్సింహా రెడ్డితో పాటు ఆమెకి కూడా కరోన సోకినా కారణంగా జూబిలీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కరోనా నెగిటివ్ అయినప్పటికీ ఊపితిత్తులలో ఇన్ఫెక్షన్ కారణంగా మరణించారు. కొద్దీ రోజుల వ్యవధి లో భార్యభర్తలిద్దరు మృతి చెందటంతో నాయిని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదం లో వున్నారు