నిజమే మీరు చదివింది సరైనదే. కొవిడ్ సమయంలో బయటకు వెళ్లాలంటే భయం. సినిమా థియేటర్లలో కలసి కూర్చోవాలంటే వణకు. డెల్టాప్లస్ అంటూ కొత్త వేరియంట్ మరింత గందరగోళంలో పడేసింది. ఇటువంటి విపత్కర వేళ కొత్త సినిమాలు థియేటర్లలో విడుదల చేయటం.. ప్రేక్షకులను రప్పించటం సవాల్. అందుకే.. విక్టరీ వెంకటేశ్ నటించిన నారప్పను ఓటీటీ వేదికగా విడుదల చేయబోతున్నారట. తమిళంలో ధనుష్ హిట్ కొట్టిన అసురన్ రీమేక్ నారప్ప.. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన సినిమాలో వెంకీ కొత్తగా కనిపించారు. సినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగాయి. అన్నీ బాగున్నట్టయితే మే 21న విడుదల కావాల్సి ఉంది. కాలం అనుకూలించకపోవటంతో అమెజాన్ ప్రైమ్‌లో జులై 26న విడుదల చేసేందుకు నిర్మాత డి.సురేష్‌బాబు ఓకే అన్నారట.



