కేరళను కొత్త భయం వెంటాడుతోంది. ఇప్పటికే కరోనా రెండో దశ భయపెడుతుంది. ఇటువంటి సమయంలోనే షిగెల్లా అనే కొత్తరకం వైరస్ మరింత ఉలికిపాటుకు గురిచేస్తోంది. భారతదేశంలో కరోనా మొదటి కేసు కేరళలోనే నమోదైంది. విదేశాలకు వెళ్లొచ్చిన వారి ద్వారా వైరస్ దేశంలోకి ప్రవేశించింది. ఆ తరువాత పక్కా ప్రణాళిక ప్రకారం అక్కడి ప్రభుత్వం ప్రజల తోడ్పాటుతో వైరస్‌ను కట్టడి చేయగలిగారు. ఇటువంటి సమయంలోనే షిగెల్లా మరో వైరస్ ఆందోళన కలిగిస్తోంది. సుమారు 20 మంది వరకూ ఈ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలోకి చేరారు. కడుపునొప్పి, అతిసార, జ్వరం వంటి వాటితో బాధపడటం దీని లక్షణం. ఈ వైరస్‌తో బాధపడుతూ ఒకరు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది.. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.



