నివర్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పోలీసుశాఖ 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని ఏపి డిజిపి తెలిపారు.ఈ రోజు అర్ధరాత్రి నుంచి పోలీసుశాఖ SDRFతో సహా ప్రతి ఒక్కరు రాత్రి పగలు అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉంటుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంలో పోలీసులు చొరవ చూపాలి. ముంపు ప్రాంతాలు వరద తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. కలెక్టర్లు,యన్ డి ఆర్ ఎఫ్, అగ్నిమాపక శాఖ అన్ని శాఖల సిబ్బందితో సమన్వయంతో పని చేయాలి కోరారు డయల్ 100/112 సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు మనవి చేసారు.