కరోనా ప్రపంచాన్ని భయపెడుతోంది. మానవాళి మనుగడనే ప్రశ్నార్ధకంగా మార్చేస్తోంది. 8 నెలలుగా ఆర్ధికంగా, సామాజికంగా కోట్లాది మంది విలవిల్లాడిపోతున్నారు. అమెరికా వంటి దేశం కూడా ఏం చేయాలో తోచక చేతులెత్తేసింది. చైనా పరిశోధనల కర్మాగారం నుంచి బయటకు వచ్చిన విషపు పురుగుకు విరుగుడు శాస్త్రవేత్తలకు సవాల్‌గా మారింది. ఫార్మా, వైద్య రంగాలు దీన్ని వీలైనంత సొమ్ము చేసుకునేందుకు సిద్ధపడ్డాయి. క్రమంగా అది ప్రపంచదేశాల మధ్య కొత్తరకమైన పోటీకు వేదికగా మారింది. అదే.. టీకా.. కరోనా వ్యాక్సీన్. స్పుత్నిక్ -వి వ్యాక్సిన్ తయారు చేశామంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించటమే కాదు. ప్రపంచానికి తామే మార్గదర్శలమంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికే చైనా తయారు చేసిన వ్యాక్సీన్ జూన్ నుంచే తమ దేశ పీపుల్ లిబరేషన్ ఆర్మీకు ఇస్తున్నామంటూ స్పష్టం చేసింది. చైనా దాన్ని మార్కెట్లోకి విడుదల చేయకపోవటంతో సొంత ప్రయోజనంగానే ముద్రపడింది. కానీ రష్యా స్పుత్నిక్ -వి టీకాపై మాత్రం యుకే, అమెరికా, బ్రెజిల్, కెనడా వంటి దేశాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. భారత్ మాత్రం ఆ వ్యాక్సీన్‌పట్ల ఆసక్తి చూపుతుంది. సూపర్ పవర్ మేమేనంటూ చంకలు గుద్దుకునే అమెరికా కూడా దాదాపు 200కు పైగా పరిశోధనలు చేస్తుంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన టీకా క్లినికల్ ట్రయల్స్‌కు భారత్ అనుమతిచ్చింది కూడా . ఒకప్పటి సూర్యుడు అస్తమించని రాజ్యాన్ని స్థాపించిన లండన్ కూడా ఇదే ఆలోచిస్తుంది. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ తామే ప్రపంచానికి మార్గదర్శకత్వం చేస్తామంటూ ప్రకటించారు. ఇన్ని దేశాలు టీకా గురించి తమకు తామే జబ్బలు చరచుకుంటూ.. ఆదిపత్యం కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. బారత్ బయోటెక్ కూడా ఇండియాలో తొలివ్యాక్సిన్ తయారు చేసేందుకు ప్రయోగాలు చేపట్టింది. దాదాపు క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తిచేసింది. అగస్టు 15న భారత్‌లో విడుదల చేసేందుకు సిద్దమై కాస్త వెనుకంజ వేసింది.