నందిగామ కు చెందిన కాపా రామ సీతమ్మ గుత్త వారి పాలెం గ్రామంలో బృందావన్ చారిటబుల్ ట్రస్ట్ వారిచే నిర్మింప చేస్తున్న వృద్ధాశ్రమానికి *1,01,116/-* రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది… వీరు కమ్మవారిపాలెం *కాపా రామలక్ష్మమ్మ సేవా సమితి కి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు* … వీరి పూర్వీకులచే భద్రాచలంలో
శ్రీ రామునికళ్యాణమందిరానికి ఎదురుగా గల శ్రీ గోవింద స్వామి మరియు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాలలో వీరివంశీకులచే గత 99 సం॥ లుగా శ్రీ రామనవమికి అక్కడకు వచ్చే భక్తులకు భోజనసౌకర్యం అందించటం జరుగుతుంది. *ఈ సంవత్సరం శతాబ్ది ఉత్సవాలకు జరుపుకోబోతున్నట్లుగా వారి కుమారులు కాపా కృష్ణ ప్రసాద్, కాపా రవీంద్రనాథ్, కాపా భానుప్రసాద్ తెలియజేశారు.
ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కరోనా సమయంలో నందిగామ లో కూడా కరోనా బాధితులకు ఇంటింటికి , అనాథలకు , వృధ్ధులకు భోజనం ప్యాకెట్లుఅందించటం జరిగిందని.. వారు ఈ సందర్భంగా తెలియజేశారు.



