నిఫర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు రూ.35వేలు పరిహారం ఇవ్వాలి. తక్షణ సాయంగా రూ.10,000 ఇవ్వాలని జనసేన అధ్యక్షుడు జనసేనాని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. రెండ్రోజుల క్రితం నిఫర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించారు. పరిహారం అందజేయాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. దీనిపై సర్కారు స్పందన రాకపోవటంతో సోమవారం హైదరాబాద్‌లోని స్వగృహంలో ఉదయం పదిగంటలకు దీక్షలో కూర్చున్నారు.