ప్రదానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన రాజకీయంగా కాకపుట్టిస్తుంది. రాజకీయాలతో సంబంధం లేని విషయమే అయినా బీజేపీ, టీఆర్ ఎస్ మాత్రం దీన్ని జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ పై ఎదురుచూస్తున్నాయి. అసలు వ్యాక్సిన్ వస్తుందా లేదా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఇటువంటి సమయంలోనే హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్‌పై సిద్దమైంది. భువనేశ్వర్, ఢిల్లీ, ముంబై, విశాఖపట్టణం, గుంటూరు తదితర ప్రాంతాల్లోనూ క్లీనికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. దీనికి కేంద్రం సహకారం కూడా లభించటంతో కొవాగ్జిన్ వ్యాక్సిన్‌కు సిద్ధమయ్యారు. కేవలం ఆరేడు నెలల వ్యవధిలోనే భారత్ బయోటెక్ తయారీకు సిద్ధమయ్యారు. ప్రయోగ దశను దాటుకుని మూడు నెలల కిందటే మనుషులపై కూడా ప్రయోగించారు.
మూడు దశల్లో జరిగిన ప్రయోగాల్లోనూ విజయం సాధించారు. దాదాపు 151 రకాల వ్యాక్సిన్‌లను తయారు చేసే భారత్ బయోటెక్ సాధించిన మరో విజయంగా దీన్ని అంచనా వేస్తున్నారు. పరిశోధనలను పరిశీలించేందుకు ప్రధాని మోదీ స్వయంగా రావటం చర్చనీయాంశంమైంది. భారత్ బయోటెక్ పరిశీలన , టీకా గురించి సమాచారం.. ప్రజలకు ఏ విధంగా పంపిణీ చేయాలనే అంశాలపై శాస్త్రవేత్తలతో మాట్లాడేందుకు ప్రధాని వచ్చారు. కానీ.. ఇదే సమయంలో జీహెచ్ ఎంసీ ఎన్నికల ప్రచారం జరుగుతున్నాయి. దీంతో ఇరు పార్టీలు ఎవరికి వారు ప్రధాని పర్యటనను వాడుకుంటున్నాయి. ఇప్పటికే బీజేపీపై టీఆర్ ఎస్ నిప్పులు చెరుగుతుంది. ఢిల్లీ నుంచి వస్తున్న వలస నేతలంటూ మరింత విమర్శలు పెంచారు. తాము వస్తామని.. నిలదీస్తామంటూ ప్రతిగా బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రజలకే కొవాగ్జిన్ వ్యాక్సిన్ ప్రాధాన్యత ఇవ్వాలంటూ మంత్రి ఈటల తాజాగా కోరారు. హైదరాబాద్‌ను ఫార్మా హబ్‌గా.. పరిశోధనలకు కేంద్రంగాచేయటంలో టీఆర్ ఎస్ ప్రభుత్వం కీలకంగా వ్యవహరిం చిందంటూ మంత్రి కేటీఆర్ చెబుతున్నారు. మరి ప్రధాని పర్యటన అనంతరం ఎన్నికల వాతావరణం ఇంకెంతగా వేడెక్కుతుందో చూడాలి.