ప్రకాశం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవికి జరుగుమల్లి మండల టీడీపీ అధ్యక్షుడు పోకూరి రవీంద్రబాబు పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
టీడీపీ బలోపేతానికి మండల స్థాయిలో కృషి చేస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న రవీంద్రబాబుకు జిల్లా స్థాయిలో అవకాశం కల్పించాలని పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులకు గుర్తింపు కల్పించాలనే నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రతిపాదన ముందుకు వచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవిపై పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అధికారిక ప్రకటన వెలువడితేనే దీనిపై స్పష్టత రానుంది.



