ఎంతైనా అది రాజకీయం. దాని పది అది చేసుకుంటూ పోతుంది. పవర్ కోసం ఎంతకైనా తెగించగలదు. సమాజం ఏమన్నా పట్టించుకోదు. అందుకే. రా అంటే రావణాసరుడు. జ.. అంటే జరాసంథుడు కీ అంటే కీచకుడు. య యమధర్మరాజు అంటూ రాజకీయం అంటే ఏనాడో కొత్త అర్ధం చెప్పారు పరచూరి బ్రదర్స్. విజయనగరం రాజుల కుటుంబం అంటే.. ఖ్యాతి. గౌరవమర్యాదలు.. సమాజంలో వారకంటూ గుర్తింపు . కోటలు పోయినా.. కిరీటాలు దూరమైనా రాజు అంటే గౌరవం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. అటువంటి విజయనగరం కుటుంబంలో రాజకీయం కొత్త చిచ్చుపెట్టింది. అసలు వీళ్ల నోటివెంట ఇలాంటి మాటలు కూడా వస్తాయా! అనేంతగా దారుణమైన విమర్శలు వస్తున్నాయి. మానస ట్రస్ట్‌కు ఛైర్ పర్సన్‌గా సంచయిత సంచయిత గజపతిరాజు వ్వవహరిస్తున్నారు. అప్పటి వరకూ చైర్మన్‌గా ఉన్న టీడీపీ నేత అశోకగజపతిరాజుకు ఉద్వాసన పలికారు. 104 దేవస్థానాలు, పలు విద్యాసంస్థలు, వేలాది ఎకరాల భూములున్న ట్రస్ట్ కు శాశ్వత ఛైర్మన్ అయిన గజపతిరాజు తొలగింపు.. ఆ తరువాత ఆయన ప్లేస్‌లో సంచయిత ఇదంతా వైసీపీ సర్కారు పగ్గాలు చేపట్టిన తరువాత చోటుచేసుకున్న పరిణామాలు. అప్పటి వరకూ టీడీపీ నాయకుడు చేతిలో ఉన్న అధికారం ఒక్కసారి వైసీపీ అనుకూల వర్గానికి రావటమే బాబాయి.. అమ్మాయి మధ్య గొడవకు కారణమైంది. ట్వీట్టర్ ద్వారా సంచయిత చేసే కామెంట్స్.. తనపై విమర్శలు గుప్పించే వారికి ఆమె ఇచ్చే సమాధానాలు చాలా ఘాటుగా ఉంటాయి. అందుకే. ఎవ్వరూ ఆమె వైపు కన్నెత్తిచూసే సాహసం చేయలేకపోతున్నారు. ఇటువంటి సమయంలో అశోకగజపతిరాజు.. తాతలు, తండ్రుల పేర్లు మార్చుకోవటం కొత్త పద్దతిగా మారిందంటూ ట్వీట్టర్‌లో ఉంచిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.