జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ 49వ పుట్టినరోజు బుధవారం వేడుకలు ఘనంగా జరిగాయి. సామాజిక సేవా కార్యక్రమాలు… ఫ్లెక్సీల.. కేక్‌లు.. అనాథలకు అన్నదానం.. ఆసుపత్రుల్లో వైద్యులకు పురస్కారం.. ఒకటా రెండా.. అన్నింటా మేమేనంటూ జనసైనికులు చాటుకున్నారు. పవన్ అభిమానుల

కోలాహలంలో పల్లెలు.. పట్టణాలు పండుగవాతావరణాన్ని సంతరించుకున్నాయి.
జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా కృష్ణ జిల్లా నందిగామ జనసేన
పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు మరియు సానుభూతిపరుల ఆధ్వర్యంలో ముందుగా

గవర్నమెంట్ హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణి, అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం , భారీ కేక్ కటింగ్ జరిగింది, పెద్ద ఎత్తున, అభిమానులు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్నిజయప్రదం చేశారు, ప్రమాదవశాత్తు మరణించిన పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియచేసారు. ఈ కార్యక్రమములో పార్టీ నియోజకవర్గ నాయకులు తోట మురళి, కామిశెట్టి వెంకటేశ్వరావు, షేక్ అజారుద్దీన్., పోలిశెట్టి కోటి, పూజారి రాజేష్ ఇంకా భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
నందిగామ మండలం కంచెల గ్రామములో జనసేన నాయకులు పోతిన వెంకట మహేష్ పార్టీ జండా స్తూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమములో గ్రామంలోని పార్టీ కార్యకర్తలు రామిరెడ్డి గోపి, వంకెన రాముడు, నాగులపాటి శ్రీనివాస రావు మరియు రావూరి నాగబాబు. ఇంకా పలువురు పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా పాల్గొన్నారు.



