గుడివాడలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటనకు అపూర్వస్వాగతం లభించింది. మీరు వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాలు చేయవచ్చు.. మేము సినిమాలు చేస్తూ రాజకీయాలు చేయకూడదా! అంటూ వైసీపీ విమర్శలు ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే కొడాలినానిపై గబ్బర్ పంచ్‌లు పేల్చాడు. పేకాట క్లబ్బులపై ఉన్న శ్రద్ధ.. రోడ్లను బాగు చేసేందుకు ఉపయోగిస్తే బావుటుందంటూ చురకేశారు. చివరి శ్వాస వరకూ ప్రజాసేవలోనే ఉంటానంటూ స్పందించారు. ఇటీవలి నిఫర్ తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు కృష్ణాజిల్లా పర్యటన చేపట్టారు.పవన్‌కు అడుగడుగునా అద్భుతమైన స్పందన లభించింది. కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా గుడివాడ చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. క్రేన్ తో భారీ గజమాల వేసి పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన అభిమానులు. అభిమానులు, పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ, గుడివాడలో రోడ్ షో నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నెహ్రూ చౌక్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్. గుడివాడకి వచ్చే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి , రహదారులు నిర్మించాలని స్థానిక ప్రజాప్రతిని ప్రజానీకం ప్రశ్నించాలి. రాష్ట్రంలో అందరికీ న్యాయం జరిగే వరకు ఎంత దూరమైనా వెళ్తా. సొంత ఒక వర్గానికి చెందిన మీడియా సంస్థలలో నోటి కొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. దాష్టికం చేస్తూ, నోటి దురుసు గా మాట్లాడే వైసిపి ప్రజా ప్రతినిధులను జనసేన బలంగా ఎదుర్కొంటుందన్నారు. గుడివాడ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నానికి సున్నితంగా వార్నింగ్ ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది.