ప్రవాస్ 3.0 – హైదరాబాదులో భారతదేశపు అతిపెద్ద ప్రజా రవాణా సమావేశం మరియు ప్రదర్శన అధికరికంగా ప్రారంభించబడింది

• భారతదేశపు ఫ్లాగ్‎షిప్ ఈవెంట్ ప్రవాస్ 3.0 యొక్క బస్ & కార్ ఆపరేటర్ల సమాఖ్య సురక్షితమైన, చురుకైన మరియు స్థిరమైన ప్రయాణీకుల గమననాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా కలిగి ఉంది.
• ఈ ఈవెంట్ యొక్క 3వ సమీక్ష ఫ్లీట్ యజమానులు మరియు ఆపరేటర్లతో సహా 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు, ఓఈఎంలు, ప్రభుత్వము మరియు విధాన నిర్ణేతల నుండి మొత్తం ప్రజా రవాణా పర్యావరణ వ్యవస్థను ఒకచోటికి తీసుకొనివస్తుంది

హైదరాబాదు, ఆగస్ట్ 5, 2022: బస్ & కార్ ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బిఓసిఐ) ఆంద్రప్రదేశ్ & తెలంగాణా రాష్ట్రాల బస్ ఆపరేటర్స్ అసోసియేషన్ తో కలిసి ప్రజా రవాణా కొరకు భారతదేశపు ఫ్లాగ్‎షిప్ కాంక్లేవ్ మర్మియు ప్రదర్శన, ప్రవాస్ 3.0 ను ప్రారంభించాయి. మూడు-రోజుల వేడుక ఎనిమిది ముఖ్యమైన విభాగాలలోని, అంటే ఇంటర్‎సిటి, ఇంట్రాసిటి, స్కూల్ బస్, ఉద్యోగుల రవాణా, పర్యాటక ఆపరేటర్లు, పర్యాటకుల క్యాబ్స్, మ్యాక్సి క్యాబ్స్ మరియు పిపిపి-ఎస్‎పివీలలోని భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ బస్ & కార్ ఆపరేటర్లను ఒకచోట చేర్చింది.

ఈ వేడుక ముఖ్య ఉద్దేశము – ‘సురక్షితమైన, చురుకైన మరియు స్థిరమైన ప్రయాణీకుల గమనము వైపు’ పరిపాలన సంస్థ, బిఓసిఐ తత్త్వాన్ని ప్రతిధ్వనిస్తుంది. ఈ సమావేశానికి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వశాఖ (ఎంఓఆర్‎టిహెచ్) మరియు గృహ మరియు పట్టణ వ్యవహారుల మంత్రిత్వశాఖ మరియు భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వము వారిచే సహకారం అందించబడింది.

శ్రీ ప్రసన్న పట్వర్ధన్, ప్రెసిడెంట్, బిఓసిఐ ఇలా అన్నారు, “గత రెండు సంవత్సరాలుగా మహమ్మారి లక్షల మంది జీవితాలలో అంతరాయం కలిగించింది. రవాణా రంగము దారుణంగా ప్రభావితం అయ్యింది మరియు భారతదేశ వ్యాప్తంగా వేలకొలది ఆపరేటర్ల జీవితాలు కూడా తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. మనము ఒక బలహీనపరచే కాలాన్ని చవిచూశాము మరియు లాక్‎‎డౌన్లు మరియు మహమ్మారి వలన సృష్టించబడిన విధ్వంసం నుండి మనం ఇంకా కోలుకునే దశలో ఉన్నాము.

ఈ రంగము కలిసికట్టుగా ముందుకు వచ్చి ఇక్కడ సంపూర్ణంగా హాజరు అయినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ప్రవాస్ 3.0 అనేది ఆలోచనల రూపకల్పన చేయుటకు, ఆవిష్కరణలను ప్రదర్శించుటకు మరియు ఉత్తమ ఆచరణలను షేర్ చేయుటకు ప్రజా రవాణా వాటాదారులను ఒకచోటకు తెచ్చే మా ప్రయత్నము. భారతదేశములో ప్రజా రవాణలో ప్రయాణించే వారి సంఖ్య పెరగవలసిన అవసరం ఉంది. రోజూ ప్రజా రవాణ 32 కోట్ల మంది ప్రయాణీకులను ఎక్కించుకుంటుంది. ఈ సంఖ్య భారతదేశములోని ఇతర రవాణా మాధ్యమాల కంటే చాలా ఎక్కువ. ఇందులో 85% బిఓసిఐ కు చెందిన ప్రైవేట్ ఆపరేటర్లు సేవలను అందిస్తున్నారు. ప్రవాస్ అనేది మా రంగము యొక్క అవసరాల గురించి అవగాహన కల్పించి ఈ రంగము అభివృద్ధికి సానుకూలమైన వాతావరణాన్ని కల్పించే దిశగా పనిచేయుటకు విధాన నిర్ణేతలు మరియు ప్రభుత్వము యొక్క దృష్టిని ఆకర్షించేందుకు చేసిన మా ప్రయత్నము. ఈ రంగానికి ఆర్ధిక ప్రేరణ, పన్ను మినహాయింపు మరియు మూలధన అందుబాటు ఎంతగానో అవసరం ఉన్నాయి. అలాగే మా రంగాన్ని శక్తివంతం చేయుటకు ప్రభుత్వము నుండి పరిశ్రమ స్థాయిని కూడా మేము కోరుతున్నాము.”

ప్రవాస్ 3.0 లో దేశవ్యాప్తంగా ఉన్న ఈ విభాగపు నాయకులు పాల్గొనే ప్రదర్శన, సమావేశాలు & వర్క్ షాప్స్, బహుమతుల ప్రదానము, రౌండ్ టేబుల్ చర్చలు, సీఈఓ నాయకత్వపు చర్చలు మరియు ప్యానెల్ చర్చలు ఉంటాయి. ఈ ప్రదర్శన ప్రయాణీకుల వాహనాల అతిపెద్ద ప్రదర్శన, మార్కెట్-అనంతర పరిష్కారాలు, యాక్సెసరీలు, వినిమయాలు, ఐటి & ఐటిఎస్ పరిష్కారాలు మరియు అనుబంధ ఉత్పత్తులు & సేవలను కలిగి ఉంటుంది.

ఈ కీలక ప్రసంగాలతోపాటు, ప్రవాస్ యొక్క ఈ ఎడిషన్ ఎలెక్ట్రిక్ వాహనాలు మరియు స్థిరమైన గమనము యొక్క ప్రదర్శనపై దృష్టి సారిస్తుంది. ఈ సమావేశము కొత్త ధోరణులను అందిస్తుంది మరియు ప్రస్తుత పరిస్థితిలో ఈ రంగములో కొత్త అవకాశాలను ఆవిష్కరిస్తుంది. ప్రయాణీకుల గమన రంగము భారతదేశాన్ని వాస్తవంగా నడిపించే ఈ రంగనికి సాధికార శక్తిని అందించుటకు, ప్రస్తుత మరియు సిఫారసు చేయబడిన నియంత్రణ మరియు విధానపరమైన ఫ్రేం వర్క్ గురించి కూడా చర్చిస్తుంది.

శ్రీ జగ్‎దేవ్ సింఘ్ ఖాల్సా, చెయిర్మెన్, బిఓసిఐ ఇలా అన్నారు, “విశాలమైన దేశం మరియు అధిక జనాభా కారణంగా భారతదేశములో ప్రజా రవాణాపై తక్షణ శ్రద్ధ చూపవలసిన అవసరం ఉంది. ఈ రంగాన్ని

పునరుద్ధరించి ప్రపంచములోనే ఉత్తమ రంగాలకు సమానంగా తీసుకొని వచ్చేందుకు పబ్లిక్ మరియు ప్రైవేట్ వాటాదారుల మధ్య సహకారము ఉండాలి. భారతదేశములో ప్రజా రవాణాను పునరుద్ధరించుటకు కీలక వాటాదారులందరిని ఒకచోటికి తీసుకొని వచ్చేందుకు ఒక వేదికను సృష్టించడము ప్రవాస్ ద్వారా మేము చేస్తున్న ప్రయత్నం.”

శ్రీ జి. కిషన్ రెడ్డి, సాంస్కృతిక, పర్యాటక మరియు ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి కొరకు కేంద్ర మంత్రి, భారత ప్రభుత్వము మరియు సికింద్రాబాదు పార్లమెంట్ సభ్యుడు ఇలా అన్నారు, “ప్రవాస్ కుటుంబముతో ఇక్కడ ఉండటం నాకేంతో సంతోషంగా ఉంది. ప్రజా గమన వాటాదారులు అందరిని ఒకే వేదికపై తీసుకొని వచ్చినందుకు బిఓసిఐ ని నేను అభినందిస్తున్నాను. ఇది చాలా గొప్ప ప్రయత్నము మరియు ప్రవాస్ దేశములోని ప్రజా రవాణా యొక్క అభివృద్ధి కొరకు పరిశీలన, ఆశయాల రూపకల్పన మరియు సూత్రీకరణ కొరకు సహాయపడే ఒక గొప్ప వేదిక.”

ప్రవాస్ 3.0 భారతదేశములోని 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాల నుండి 10000+ వ్యాపార సందర్శకులను, సమావేశములో 100+ నిపుణులైన వక్తలను మరియు అన్ని రంగాలలో ఉన్న 200+ ప్రముఖ ప్రదర్శనకారులను ఆకర్షిస్తుంది. ఇందులో పాల్గొనే ప్రముఖ సంస్థలు ఆశోక్ లేలాండ్, టాటా మోటర్స్, వీఈ కమర్షియల్, రెడ్ బస్, భారత్ బెంజ్, మహింద్రా, ఒలెక్ట్రా, కుమిన్స్, ఫోర్స్ మోటర్స్, ఎక్సైడ్-లెక్లాంచ్, బ్లాక్ బక్ ఈవి, బిట్ల సాఫ్ట్‎వేర్, వాలియో, ఎస్‎ఎంఎల్, ఇంటెల్, కేపిఐటి, కిండ్రిల్, పేటిఎం, ఐసిఐసిఐ బ్యాంక్ మొదలైనవారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here