రాజేంద్రనగర్ డివిజన్ పల్లె చెరువు, గగన్ పహాడ్ తదితర ప్రాంతాల పరిస్థితిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్, ఐఏఎస్., సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి, ఐపీఎస్., రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళ, రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి తదితర అధికారులతో కలిసి ఈరోజు సమీక్షించారు. ముందుగా పల్లె చెరువు వద్ద జరుగుతున్నచెరువు కట్ట నిర్మాణ పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. చెరువు కట్ట నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆమోయ్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్, ఐఏఎస్., మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు నిన్నతాను చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఇరిగేషన్ డెపార్ట్ మెంట్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఐఏఎస్., సైబరాబాద్ సీపీ సజ్జనార్, ఐపీఎస్., డిసిపి ప్రకాష్ రెడ్డి, ఐపీఎస్., ఇరిగేషన్ డెపార్ట్ మెంట్ ఎస్ఈ మురళీకృష్ణ, హైదర్ ఖాన్ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్, నరేంద్ర కుమార్ డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్, ఏఈఈ విశ్వం, జిహెచ్ఎంసి అధికారులు, తదితర అధికారులతో కలిసి సమీక్షించామన్నారు. మంత్రి కెటీ రామారావు, చీఫ్ సెక్ట్రేటరీ సోమేష్ కుమార్ ఇతర ఉన్నతాధికారుల సూచనల మేరకు వర్ష ఉధృతి నివారణకు చెప్పటాల్సిన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. అధికారులంతా రౌండ్ ద క్లాక్ 24 గంటలు అందుబాటులో ఉంటూ అన్ని సహాయక చర్యలు చేపడుతున్నమాన్నారు. ఇప్పటికీ ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. వారికి ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులను అందస్తున్నామన్నారు.
ఉండా సాగర్, జల్పల్లి తదితర చెరువులకు లింక్ ఉండడంతో పల్లె చెరువు కు భారిగా వస్తున్న నీతి ప్రవహాన్ని కట్టడి చేశామన్నారు.
పోలీసులు 72 గంటలు రాత్రింబవళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ మనోధైర్యాన్ని నింపుతున్నారన్నారు.
చెరువులు తెగిపోయిన చోట ఇసుకబస్తాలు అడ్డుపెట్టి వరద ఉధృతికి అడ్డుకట్ట వేశామన్నారు.కమిషనర్ నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అందుబాటులో ఉండి ప్రమాదాన్ని కట్టడి చేశారన్నారు.
సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., మాట్లాడుతూ నగరంలో కురిసిన భారీ వర్షాలకు పల్లె చెరువు కట్టతెగి లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారి ఇళ్లల్లోకి నీరు వెళ్లే ప్రమాదం ఉన్నందన చెరువు కట్ట నిర్మాణ పనులను దగ్గెరుండి పర్యవేక్షిస్తున్నామన్నారు.
ఈ చెరువు ఇంకా ఉధృతంగా ప్రవహిస్తే లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారి ఇళ్లల్లోకి నీరు వెళ్లే ప్రమాదం ఉందన్నారు. దీంతో పోలీస్ యంత్రాంగాన్ని, ఆక్టోపస్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశామన్నారు. ఇప్పుడు కొంచెం వరద ఉధృతి తగ్గిందని చెప్పారు .
మరీ ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ, జిల్లా యంత్రాంగం కొన్ని ఫంక్షన్ హాళ్లను ఏర్పాటు చేసిందని, బాధితులు అక్కడకు వెళ్లాలని సజ్జనార్, ఐపిఎస్ గారు విజ్ఞప్తి చేశారు.
పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ మైక్ ల ద్వారా ప్రచారం చేస్తున్న పోలీసులు.. వీలైనంత త్వరగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటూ అనౌన్స్ మెంట్ చేస్తున్నారు.. ఇప్పటికే అలీ నగర్ , సుబాన్ కాలనీ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు.సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్ జోన్ లో తెగిపోవడంతో వరదనీరు జాతీయ రహదారిపై ముంచెత్తుతాయన్నారు. దీంతో రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందన్నారు. శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి, సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్ ఎం విజయ్ కుమార్ అక్కడికి చేరుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టడంతో ప్రమాద స్థాయి తగ్గిందని చెప్పారు
హిమాయత్ సాగర్ వేస్తున్నారని సమాచారం అందగానే గంటల వ్యవధిలో స్థానిక ఫంక్షన్ హాల్ కు తరలించామన్నారు.జల్పల్లి ప్రాంతంలో అర్ధరాత్రి నెల్లూరు నుంచి వచ్చిన బస్సు అందులో చిక్కుకు పోయింది దాదాపు 60 మంది ప్రయాణికులు బస్సు లోని చిక్కుకుపోగా పోలీసులు జెసిబి సహాయంతో బస్సులు బయటకు లాగి దాన్ని కాపాడామన్నారు.ఆల్విన్ కాలనీ లో అక్టోపస్, పోలీస్ సిబ్బందిని రంగంలోకి దింపి సహాయక చర్యలు చేపట్టినిట్లు చెప్పారు. సుభాన్ కాలనీ లో చిక్కుకున్న 40 మంది ని హాలీవుడ్ కాలనీలో లో చిక్కుకుపోయిన 15 మంది తమిళనాడు వాసనలు తాడు సహాయంతో బయటకు తీసుకువచ్చామని తెలియాచేసారు. పల్లె చెరువు వీళ్ళ ఇసుక బస్తాలతో కాలనీలోకి నీరు రాకుండా చేసి ప్రస్తుతం పల్లె చెరువు ఉందా సాగర్ జల్ పల్లి చెరువుల నుంచి నీరు వస్తుండడంతో దాదాపు 5 వేల ఇసుక బస్తాలతో పల్లె చెరువు వద్ద నీటి ప్రవాహాన్ని అడ్డుకున్నారు.
ప్రకృతి సృష్టించిన విలయంలో అధికారులు, ప్రజలంతా కలిసి కట్టుగా పనిచేస్తున్నారని చెప్పారు



