ఈ నెల 16న గ్రాండ్ గా విడుదలవుతున్న” రాజా”

రాంకి (వీర్నాల రామకృష్ణ),దివ్య రావు (డిగ్రీ కాలేజ్ ఫేమ్), ఆస్మ, యాంకర్ శ్యామల, పోసాని కృష్ణ మురళి నటీనటులుగా ఏ ఆర్కె ఆర్ట్స్ సమర్పణలో వస్తోన్న సినిమా “రాజా”. టోటల్ యూత్ అడల్ట్ కంటెంట్  సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 16న విడుదలవుతున్న సందర్భంగా.

హీరో మరియు దర్శకుడు రాంకి (వీర్నాల రామకృష్ణ) మాట్లాడుతూ…అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 16న గ్రాండ్ గా “రాజా” సినిమాను విడుదల చేస్తున్నాము. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. గతంలో మేము విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్,  మోషన్ పోస్టర్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎంతలా అంటే… 10 రోజుల్లో మా సినిమా బిజినెస్ ని క్లోజ్ చేసే అంతలా ఈ టీజర్ కి బయ్యర్స్ నుంచి ఆఫర్ వచ్చింది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ గా యూత్ ని అలరిస్తుంది. హీరోయిన్ లు  దివ్య రావ్ (డిగ్రీ కాలేజ్ ఫేమ్), ఆస్మ లు చాలా బాగా నటించారు.యాంకర్ శ్యామల కూడా ఎంతో బిజీ గా వున్నా మేము అడిగిన వెంటనే మాకు చాలా బాగా సపోర్ట్ చేసింది.చాలా మంది అరిస్టులు కూడా బాగా సపోర్ట్ చేశారు. వారందరికీ ధన్యవాదాలు.వీళ్ళతో పనిచేయడం నాకు చాలా కంఫర్ట్ అనిపించింది. ఫస్ట్ టైం నటిస్తున్నాననే ఫీలింగ్ లేకుండా చేశారు. ముఖ్యంగా పోసాని కృష్ణ మురళి ఎంతో బిజీగా ఉన్నా కూడా మా సినిమాలో నటించి నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. ఆయన చేసిన కామెడీ సినిమాలో హైలైట్. ఎంతో హెల్దీగా  తన కామెడీ టైమింగ్ తో నవ్వించారు. ఆయకు ధన్యవాదాలు. ఇది మహిళల ఇమేజ్ ని పెంచే ఓ మంచి మెసేజ్ ఉన్న సినిమా. రొమాన్స్ విషయంలో మహిళల ఫీలింగ్స్ ఎంటనేది చాలా సున్నితంగా తెరమీద చూపించాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా తప్పక నచ్చుతుంది అని అన్నారు.

చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చింది.మా అదృష్టం ఏంటంటే సినిమా రేలీజ్ కు ముందే బిజినెస్ అయిపోవడం, అలాగే థియేట్రికల్స్ వేరే వాళ్ళు తీసుకొని రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది.మా కంటెంట్ లో దమ్ముంది కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విడుదల చేస్తున్న రెండు రాష్ట్రాల డిస్ట్రుబ్యూటర్లకు ధన్యవాదాలు. అందరూ ఇలాంటి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తే చాలా మంది బతుకుతారు.మరియు మా సినిమా పోస్టర్స్, ట్రైలర్స్ ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు మా ధన్యవాదాలు. అలాగే మా సినిమాను కూడా ఆదరించి మమ్మల్ని మా టీంను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.

నటీనటులు
హీరో: రాంకి (వీర్నాల రామకృష్ణ)
హీరోయిన్: దివ్య రావు (డిగ్రీ కాలేజ్ ఫేమ్)
సెకండ్ హీరోయిన్: ఆస్మ
పోసాని కృష్ణ మురళి, యాంకర్ శ్యామల, టార్జెన్, జయవాణి, జోగి బ్రదర్స్ (కృష్ణ, నాయుడు) గౌతంరాజు, అశోక్ కుమార్, మేఘన చౌదరి, జబర్దస్త్ బాబి, జబర్దస్త్ దొరబాబు, మైత్రి రజిత, దీప్తి.

సాంకేతిక నిపుణులు
టైటిల్: “రాజా”
బ్యానర్: ఏఆర్కే ఆర్ట్స్
నిర్మాత: ఏఆర్కే ఆర్ట్స్
ప్రజెంట్స్: ఏఆర్కే ఆర్ట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డి.గురువరవ్
డిఓపి: రాజు
ఎడిటర్: బి.ఎన్. ఆర్.
ఆర్. ఆర్.: తమిరి శంకర్
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, హరి గౌర, కసర్ల శ్యామ్
స్టొరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: రాంకి (రామకృష్ణ)
డైలాగ్స్: రాంకి, జి.రవి, విజయ్
పిఆరోఓ: మధు.విఆర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here