మేమున్నామని.. ఇంకేం కాదని..

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో బండ్లగూడా జాగీర్ లోని లోతట్టు ప్రాంతమైన P&T కాలనీలో భారీ గా నీరు చేరింది. దీంతో పోలీసులు ప్రజలందరిని సురక్షిత ప్రాంతాలకు,పునరావాస కేంద్రాలకు తరలించారు.  P&T కాలనీలోని ఓ గెస్ట్ హౌజ్ లో 8 మంది చిక్కుకున్నారని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రాజేంద్రనగర్ పోలీసులు వారిని రక్షించి వారి బంధువుల ఇంటికి తరలించారు.ఇన్ స్పెక్టర్ సురేశ్, సబ్ ఇన్ స్పెక్టర్ సమరం రెడ్డి, సబ్ ఇన్ స్పెక్టర్ బాలరాజ్, పోలీస్ కానిస్టేబుల్ నాగేశ్,  P&T కాలనీలోని గెస్ట్ హౌజ్ లో చిక్కుకున్న అందరిని తాళ్ల  సాయంతో రక్షించారు. పోలీస్ కానిస్టేబుల్ నాగేశ్ ధైర్యం చేసి రోప్ సాయంతో మొత్తం 8 మందిని బయటకు తీశాడు. వీరిలో ముగ్గురు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. స్థానికులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.రాజేంద్రనగర్ పోలీసుల సీపీ సజ్జనార్ అబినంధించారు

Previous articleహైదరాబాద్ లో వర్ష బీభ‌త్సం – అధికారుల చర్యలు.
Next articleబాబు అండ్ జ‌గ‌న్ ఎవ‌రు ఎవ‌రికి స్కెచ్ వేసుకుంటున్నారో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here