ఈరోజు సాయంకాలం కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు. ఐదు దశాబ్దాలకు పైగా చురుకైన రాజకీయాల్లో ఉన్న మరియు దేశంలోని ప్రసిద్ధ దళిత నాయకులలో ఒకరైన పాస్వాన్ (74) గత కొన్ని వారాలుగా ఆసుపత్రిలో ఉన్నారు. ఈయన ప్రస్తుత కేంద్ర మంత్రి వర్గం లో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖకు మంత్రిగా వున్నారు ప్రధాన మంత్రి మోడీ ట్విట్టర్ సందేశం లో తానూ ఒక మంచి మిత్రుడిని కోల్పోయానని, ఇది తనకు వ్యక్తిగతంగా పెద్ద లోటు అని ప్రకటించారు.