మందేస్తూ. చిందేయరా.. చిందేస్తూ మందేయరా.. దసరా రోజు మనోళ్లు అదే చేశారు. రెండు, మూడ్రోజులు వరుసగా సెలవులు రావటంతో దావత్‌లలో మునిగితేలారు. కరోనా సమయంలో పార్టీలు.. చిందులు అన్నీ దూరమ్యాయి. క్రమంగా కరోనా ఆంక్షలు ఎత్తేయటంతో మందుబాబులు బాగానే రెచ్చిపోతున్నారు. ఇక పండుగ ఆదివారం వచ్చింది.. మరుసటి రోజు సోమవారం కూడా సెలవు ఇచ్చేశారు. దసరా ఒక్కరోజే తెలంగాణలో రూ.100 కోట్ల మద్యం ఠాగేశారట. ఆ నాలుగు రోజుల్లో అబ్కారీ శాఖ ఆదాయం ఎంతో ఏకంగా రూ.400 కోట్లట. గతేడాది ఇదే దసరా వారం రోజుల్లో 1350 కోట్లరూపాయల మద్యం విక్రయాలు జరిగితే.. ఈ దసరాకు మాత్రం ఏకంగా రూ.1980 కోట్ల వరకూ చేరిందట. ఏమైనా మాంచి కిక్ ఇచ్చేది ఏమైనా ఉందంటే.. అది మందు మాత్రమేనంటూ మరోసారి చాటుకున్నారన్నమాట.