హైదరాబాద్‌లో రెనో క్విడ్‌ మైలేజీ ర్యాలీ వేడుకలు

 ఈ ర్యాలీకి కస్టమర్ల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది, 30 కస్టమర్ల కంటే ఎక్కువ మంది ఇందులో పాల్లొన్నారు
 ఎస్‌యూవీ-ప్రేరణతో రూపొందించిన డిజైన్‌, ఈ సెగ్మెంట్‌లో మొట్టమొదటి ఫీచర్లు, ఈ రంగంలోనే తొలి ఆవిష్కరణలు క్విడ్‌ విజయానికి బాటలు వేశాయి

హైదరాబాద్‌, నవంబర్‌ 27, 2021: భారతదేశంలో 4-లక్షల సంచలన మైలురాయిని ఇటీవలే దాటిన రెనో క్విడ్‌, మినీ-కారు సెగ్మెంట్‌లో ప్రధాన శ్రేణిలో నిలుస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ మైలురాయిని హైదరాబాద్‌లో – క్విడ్‌ యజమానులతో కలిసి నిర్వహించిన రెనో క్విడ్‌ మైలేజీ ర్యాలీ ద్వారా రెనో జరుపుకుంది. మొత్తం 100 కి.మీ దూరం సాగిన ఈ ర్యాలీకి Hotel Radisson, Hitech City, Gachibowli, Hyderabad లో పచ్చజెండా ఊపారు.

ప్రస్తుత క్విడ్‌ కస్టమర్లు మ్యాగ్జిమం మైలేజీ పొందాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ వేడకకు అనూహ్యమైన స్పందన లభించింది. 30 కస్టమర్ల కంటే ఎక్కువ మంది ఇందులో ఉత్సాహంగా, ఆనందంగా పాల్గొన్నారు. ర్యాలీ 32.5 Kmpl అత్యుత్తమ సగటు మైలేజీని నివేదించింది.. అద్భుతమైన డిజైన్‌, సృజనాత్మకతతో కూడిన గొప్ప మైలేజీతో పాటు అమూల్యమైన విలువను అందిస్తుందని క్విడ్‌ మరోసారి నిరూపించింది.

అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు, పనితీరును దృష్టిలో ఉంచుకొని భారతీయ కొనుగోలుదారుల కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసి రూపొందించిన వాహనం రెనో క్విడ్‌. “మేక్‌ ఇన్‌ ఇండియా” పథకపు సిద్ధాంతాన్ని ఇది బలంగా ప్రతిధ్వనింపజేస్తుంది. భారతీయ అనుభవం, నైపుణ్యాన్ని అందిపుచ్చుకొని అంతర్జాతీయంగా సమర్థవంతమైన ఉత్పత్తులను భారతదేశంతో పాటు మిగిలిన ప్రపంచానికి అందించేందుకు ఇది కృషి చేస్తుంది.

RXE, RXL, RXT, క్లైంబర్‌ వేరియంట్స్‌తో 0.8 లీటర్లు, 1.0 లీటర్ల SCe మ్యానువల్‌, AMT ఆప్షన్స్‌ పవర్‌ట్రెయిన్స్‌తో కూడిన 9 ట్రిమ్స్‌లో అందుబాటులో ఉండే రెనో క్విడ్‌, భారతదేశంలో రెనో బ్రాండ్‌ ఎదుగుదలలో కీలకంగా నిలుస్తోంది. ఎస్‌యూవీ ప్రేరణతో రూపొందించిన డిజైన్‌, మొట్టమొదటిసారిగా 20.32 సెం.మీటర్ల టచ్‌ స్క్రీన్‌, ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ ప్లేతో కూడిన మీడియాన్యావ్‌, ఫ్లోర్‌ కన్సోల్‌ మౌంటెడ్‌ AMT డయల్‌ వంటవన్నీ డ్రైవింగ్‌ను శ్రమలేకుండా చేస్తున్నాయి.

10వ వార్షిక వేడుకల సందర్భంగా రెనో ఇటీవలే క్విడ్‌ MY 21ను లాంచ్‌ చేసింది. భారతదేశంలో వర్తించే అన్ని సేఫ్టీ నిబంధనలకు కట్టుబడి ఉండే MY21 అన్ని వేరియంట్స్‌లో డ్యూయల్‌ ఫ్రంట్‌ ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్‌ ఫీచర్స్‌గా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. కారు ఆకర్షణను మరింత పెంచేందుకు MY21 క్లైంబర్‌ ఎడిషన్‌లో డ్యూయల్‌ టోన్‌ వైట్‌ అండ్‌ బ్ల్యాక్‌ ఎక్స్‌టీరియల్‌ కాంబినేషన్‌తో పాటు ఎలక్ట్రిక్‌ ఓఆర్‌వీఎం, డే, నైట్‌ ఐఆర్‌వీఎం ఉన్నాయి. ముందు భాగంలో డ్రైవర్‌ సైడు ఉండే పైరోటెక్‌, ప్రీటెన్షనర్‌ వాహన భద్రతను మరింత పెంచుతాయి.

క్విడ్‌ కస్టమర్లు అందరికీ స్పేర్‌ పార్టులు, విడిభాగాలపై 10% డిస్కౌంట్‌, లేబర్‌ ఛార్జీలపై 20% డిస్కౌంట్‌ సహ అనేక స్పెషల్‌ ఆఫర్లను రెనో ప్రకటించింది.

Previous articleనూతన నటీనటులతో ప్రారంభమైన కొత్త చిత్రం ” ఏది నిజం “
Next articleగేమ్ ఆన్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here