రెనోవా హాస్పిటల్స్- మల్టీ స్పెషాలటీ హాస్పిటల్స్ గ్రూపు లంగర్ హౌస్, సనత్ నగర్, బంజారా హిల్స్ లో ఇప్పటికే హాస్పిటల్స్ ను కలిగి ఇపుడు కొత్త కొంపల్లిలో కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డా. అభిజిత్ సేత్, అధ్యక్షులు, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎక్జామినేషన్స్ ముఖ్య అతిథిగా పాల్గొనగా పద్మభూషణ్ డా. బికె రావు, ఛైర్మన్, NABH వారు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. వీరితో పాటూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డా. అజయ కుమార్, సభ్యులు, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎక్జామినేషన్స్ మరియు డా. రవీందర్ రెడ్డి, ఛైర్మన్, తెలంగాణా స్టేట్ మెడికల్ కౌన్సిల్ లు ప్రత్యేక అతిథులుగా కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది.
రెనోవా హాస్పిటల్స్ – మంచి ఆరోగ్యాన్ని తిరిగి పొందండి అనే నినాదంతో పని చేస్తున్న మల్టీ స్పెషాలటీ హాస్పిటల్ సమూహం. ప్రధానంగా అత్యవసర చికిత్స, ట్రూమా కేర్ అందించే లక్ష్యాలతో ఏర్పడిన హాస్పిటల్ సమూహం ఇప్పటికే లంగర్ హౌజ్, సనత్ నగర్, బంజారా హిల్స్ లో హాస్పిటల్స్ నిర్వహిస్తోంది. ఇపుడు కొత్తగా కొంపల్లి లో ప్రారంభమైంది. 2021 నాటికి మరో రెండు బ్రాంచ్ లు ప్రారంభించే విధంగా ప్రణాళికలు రూపొందించబడ్డాయి. అత్యంత సమర్థవంతమైన నాయకత్వంలో నాణ్యత కలిగిన వైద్య సేవలను అందుబాటైన ధరలలో అందించడమే సంస్థ ప్రధాన ఉద్దేశ్యం. మొత్తం 300 కోట్ల పెట్టుబడి ప్రణాళికలలో ఇప్పటికే 120 కోట్లు పెట్టుబడిగా పెట్టడంతో పాటూ భవిష్యత్తులో మరో 180 కోట్లతో మరో 6 బ్రాంచ్ లను స్థాపించే దిశగా సంస్థ సాగుతోంది.
ఇలా కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమ అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో కార్యక్రమానికి హాజరైన ఆహూతులు పాల్గొని మాట్లాడారు. ముందుగా కార్యక్రమానికి హాజరైన అతిథులకు స్వాగతం పలుకుతూ శ్రీ పి. శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్, రెనోవా హాస్పిటల్స్ వారు మాట్లాడుతూ కొంపల్లి లో ప్రారంభమైన హాస్పిటల్ లో 100 బెడ్లు ఉంటాయని, ఇందుకోసం సంస్థ 30 కోట్ల రూపాయాలు పెట్టబడి పెట్టి అన్ని రకములైన అత్యాధునిక సదుపాయాలు, నిపుణులైన వైద్యులను అందుబాటులోనికి తీసుకొని వచ్చిందని వివరించారు. ఈ కొత్త హాస్పిటల్ లో అత్యవసర సేవలు, ట్రూమా సేవలతో పాటూ న్యూరాజజీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, యూరాజలీ, నెఫ్రాలజీ, గాస్ట్రో ఎంటీరియాలజీ, రుమటాలజీ వంటి సూపర్ స్పెషాలటీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అంతే గాకుండా అవుటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉండడం వలన కొంపల్లి హాస్పిటల్ లో ఏదైనా ప్రమాదం జరిగిన వారికి వైద్య చికిత్స అందించే వీలుగా అన్ని సదుపాయాలు అందుబాటులో తీసుకొని వచ్చామని వివరించారు.
అంతకు ముందు హాస్పిటల్ ప్రారంభించిన తర్వాత అథిథులందరూ అన్ని సదుపాయాలను సందర్శించి అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను మొదటి నుండి పాటించడమే కాకుండా త్వరగా NABH అక్రిడియేషన్ కు వెళ్లడాన్ని ప్రశంసించారు.