మనీష్, పాయల్ ముఖర్జీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘రెటీనా’. ఈ చిత్రాన్ని వైవిధ్యభరితమైన కథా కథనాలతో డైరెక్టర్ అల్లం రాజు రూపొందిస్తున్నారు. పార్వతి సినిమాస్ బ్యానర్ పై హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ప్రొడ్యూసర్ పార్వతి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్, సాంగ్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా
మ్యూజిక్ డైరెక్టర్ హర్ష ప్రవీణ్ మాట్లాడుతూ – మా “రెటీనా” మూవీ పోస్టర్, సాంగ్ లాంఛ్ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మ్యూజిక్ కు స్కోప్ ఉన్న చిత్రమిది. మీ అందరికీ నచ్చేలా మంచి మ్యూజిక్ ఇచ్చేందుకు ప్రయత్నించా. మా సినిమాకు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.
మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు మాట్లాడుతూ – ఈ చిత్ర సాంగ్ చాలా బాగుంది. ఈ కంటెంట్ తోనే సినిమా చూడాలనే ఆసక్తి కలుగుతోంది. హీరో మనీష్ అందంగా ఉన్నాడు. విజయ్ దేవరకొండలా కనిపిస్తున్నాడు. ఆయనకు ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలి. ఈ సినిమా టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా. అన్నారు.
డైరెక్టర్ అల్లం రాజు మాట్లాడుతూ – ఈ చిత్ర స్క్రిప్ట్ మా ప్రొడ్యూసర్ గారికి బాగా నచ్చింది. ఇలాంటి కథ తాను వినలేదని ఆమె చెప్పారు. కథ విన్న వెంటనే మనం సినిమా చేస్తున్నామని ముందుకొచ్చారు. మంచి ఎమోషన్స్ తో సాగే చిత్రమిది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించాం. మా టీమ్ అంతా సినిమా కోసం బాగా సపోర్ట్ చేశారు. హర్ష ప్రవీణ్ మ్యూజిక్ హైలైట్ అవుతుంది. మా సినిమా స్టోరీ బాగుంటుంది. సినిమా డిఫరెంట్ ఎక్సిపీరియన్స్ ఇస్తుంది. అన్నారు.
ప్రొడ్యూసర్ పార్వతి మాట్లాడుతూ – రెటీనా ఒక మంచి మూవీ. ఇలాంటి మంచి చిత్రాన్ని మీ ముందుకు అన్ని హంగులతో, క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా తీసుకొచ్చేందుకు నా శక్తి మేరకు ప్రయత్నిస్తున్నా. మా సినిమాను ప్రేక్షకులు సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాం. ఈ జర్నీలో నాకు పూర్తిగా సపోర్ట్ చేసిన మా టీమ్ కు థ్యాంక్స్. మీ అందరి సహకారం కూడా మా సినిమాకు ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరోయిన్ పాయల్ మాట్లాడుతూ – మా మూవీ సాంగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఈ చిత్ర కథ విన్న తర్వాత తప్పకుండా ఈ మూవీలో నటించాలని అనిపించింది. నేను టాలీవుడ్ కు కొత్త. మా టీమ్ చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ను మీకు అందిస్తుంది. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన మా హీరో మనీష్, మా ప్రొడ్యూసర్ పార్వతి, మా డైరెక్టర్ అల్లం రాజు గారికి థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
హీరో మనీష్ మాట్లాడుతూ – మా మూవీ సాంగ్ మీకు నచ్చిందని నమ్ముతున్నాను. ఈ సాంగ్ లాగే సినిమా కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మా డైరెక్టర్ గారు ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలని, ఒక మంచి స్క్రిప్ట్ చెప్పాలని ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఆయనకు ఈ సినిమాతో అలాంటి అవకాశం దక్కింది. ఇండస్ట్రీలో మా డైరెక్టర్ మంచి పేరు గుర్తింపు తెచ్చుకుంటారు. అలాగే మా ప్రొడ్యూసర్ మమ్మల్ని సొంత వాళ్లలా చూసుకున్నారు. మా టీమ్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ లా ఈ సినిమా కోసం కష్టపడ్డాం. మా టీమ్ లోని ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇతర మూవీ టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు.
నటీనటులు – మనీష్, పాయల్ ముఖర్జీ, తదితరులు
టెక్నీషియన్స్
డీవోపీ – రవి కె రెడ్డి
ఆర్ట్ డైరెక్టర్ – మధు
అసోసియేట్ డైరెక్టర్ – రామకృష్ణ భేరి
కో డైరెక్టర్ – ఎస్ఎస్ భార్గవ్ దార్ల
మ్యూజిక్ డైరెక్టర్ – హర్ష ప్రవీణ్
కొరియోగ్రఫీ – దేవా
కాస్టింగ్ డైరెక్టర్ – జాక్సన్
బ్యానర్ – పార్వతి సినిమాస్
రచన, దర్శకత్వం – అల్లం రాజు
ప్రొడ్యూసర్ – పార్వతి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయమ్మ



