పెద్దలమాట చద్దన్నం మూట అనే సామెత వినే ఉంటారు. కానీ.. అబ్బే వాళ్లదంతా పాతకాలం అంటూ కొట్టిపారేస్తుంటుంది ఈ తరం. కానీ ఆ కాలం వారిలో జీవనశైలి వ్యాధులు కూడా లేవు. దీనికి కారణం తాత/ బామ్మల ఆహారపు అలవాట్లు. పొద్దున్న లేవగానే చద్దన్నంలో కాస్త పెరుగు కలుపుకుని తినేవారు. మధ్యాహ్నం వరకూ పొలంలో పనిచేసినా అలసిపోయేవారు కాదు. ప్రస్తుతం .. అదే చద్దన్నం.. ప్రొటీన్లు పంచే ఆహారం అంటున్నాయి పరిశోధనలు. అమెరికా వంటి దేశాలు పరిశోధనలు చేసి బాబోయ్ చద్దన్నం ఆరోగ్యకరమంటున్నాయి… మన తాతలు ఏ నాడో నేర్పిన పాఠాలకు పరిశోధన పేరుతో అగ్రదేశం ఇప్పుడు తానేదో గొప్ప విషయం చెప్పినంతగా ఫీలవుతోందన్నమాట. పోన్లే వీటిని కాసేపు పక్కన బెడదాం..?
ప్రోటీన్ ఫుడ్‌తో ఇమ్యూనిటీ బూస్టర్.. రాబోయేది శీతాకాలం. ఏ మాత్రం శరీరంలో రోగనిరోధకశక్తి తగ్గినా వ్యాధులు ముసురుకుంటాయి. దీన్నుంచి బయటపడేందుకు ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రోటీన్ అనగానే మాంసాహారంలోనే ఉంటాయనే భావన ఉంది.. కానీ శాకాహారంలోనూ అవి సమృద్ధిగా ఉంటాయి. ప్రస్తుత పరిస్థితులలో కొవిడ్ 19 వైద్యము తీసుకొన్న వారు తొందరగా కోలుకోవడానికి/ ఇతరులు రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, ప్రోటీన్స్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఇవి మాంసాహారం తినలేని/అలవాటు లేని వారికి ప్రత్యామ్నాయాలు
వివిధ ఆహార పదార్ధాలలో ఉండే ప్రోటీన్స్ సుమారుగా…
*ఒక కోడి గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.
*ఒక బాతు గుడ్డులో 10 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.
*100 గ్రాముల ఉప్పు శనగలు లేదా పుట్నాలలో 30 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.
*100 గ్రాముల చికెన్ లో సుమారు 30 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.
*100 గ్రాముల పొట్టేలు మాంసములో 25 నుండి 30 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.
*100 గ్రాముల పశువుల మాంసములో 25 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.
అధిక ప్రోటీన్స్ కోసం. ప్రత్యామ్నాయ ఆహార పదార్ధాలు.
1. తెలగపిండి లేదా నువ్వుపప్పు చెక్క. నువ్వుల నూనె తీసిన తరువాత వచ్చే తెలగపిండిలో అధిక ప్రోటీన్స్ ఉంటాయి. అయితే దీనికోసం శుభ్రం చేసిన, మట్టి,రాళ్లు లేని నువ్వు పప్పుని వాడాలి. (నల్ల నువ్వుల పైన ఉండే పొట్టను తీస్తే వచ్చే దానిని నువ్వు పప్పు అంటారు.)
అటువంటి తెలగపిండి 10౦ గ్రాములలో సుమారు 30 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.
పచ్చి శనగపప్పును నానబెట్టి తెలగపిండి తో కలిపి కూర వండుకోవచ్చును.
2. చద్ది అన్నము. ప్రతి 100 గ్రాములలో 15 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.
100ml పాలలో 3.5 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.
అవే 100ml పాలు పెరుగు గా మారితే 10 గ్రాముల ప్రోటీన్స్ అవుతాయి.
అదే 100ml పాలను, అన్నమును పిసికి, దానికి పాలు కలిపి 8 గంటలు తోడు పెడితే చద్ది అన్నము అవుతుంది. అప్పుడు 100ml పాలనుండి 15 గ్రాముల ప్రోటీన్స్ తయారు ఆవుతాయి. ( దీనిని పొద్దున్న తినాలి. రాత్రి పూట తినరాదు. )
చద్ది అన్నము తినలేని వారు మధ్యాహ్న భోజనంలో పెరుగు అన్నమును తినవచ్చును.
రాత్రి భోజనంలో పెరుగు, మజ్జిగ తినకపోవడము మంచిది.
3. నానబెట్టిన పెసలు, శనగలు… మొలకలు కడితే ఇంకా ప్రోటీన్స్ , growth hormones, enzymes పెరుగుతాయి.
అయితే వీటితో కలిపి వండిన వాటిని తినక పోవుట మంచిది. వీటితో కలిపి నాన బెట్టిన కొన్ని గింజలు, డ్రైఫ్రూట్స్ , పచ్చి కూరగాయలు , పచ్చి కొబ్బరి లాంటివి ఒక పూట లేదా పొద్దున్నే ఆహారంగా తినవచ్చును.
4. ఉప్పు శనగలు, నువ్వులు-బెల్లము ముద్ద… టిఫిన్స్ లో తినే పల్లి లేక పుటానా చట్నీ లలో కూడా అధిక ప్రోటీన్స్ ఉంటాయి.
5. పెసర కట్టు లేదా కంది కట్టు ( పెసర పప్పు లేదా కంది పప్పు వండిన నీరు ) వీటిలో సులభముగా జీర్ణమయ్యే ప్రోటీన్స్ ఉంటాయి.
6. ఉడక బెట్టిన బఠాణీలు, రాజ్మా, చిక్కుడు, తమ్మ కాయ ( సమ్మ కాయ) గింజలలో కూడా అధిక ప్రోటీన్స్ ఉంటాయి.
7. మొలకలు కట్టి ఎండ బెట్టిన రాగులు, సజ్జలు, జొన్నలు, యవ్వలలో ప్రోటీన్స్ అధికముగా ఉంటాయి. వీటిని పొడి చేసుకొని జావ లేదా పాయసము లేదా అంబలిలాగా కాసుకొని త్రాగవచ్చు. వీటిని రాత్రి సమయములో త్రాగితే మజ్జిగ లేదా పెరుగు కలపకుండా త్రాగాలి.
8. కొందరు పిల్లలు ఉడక బెట్టిన పప్పు కూరలను ఇష్టముగా తినలేక పోవచ్చు. అటువంటి వారికి … వేయించిన కందిపప్పు లేదా పెసర పప్పును పొడి చేసి ధనియాలు, మిర్చి, జీరా, ఉప్పు కలిపి పొడిలాగ చేసుకొని అన్నము లేదా టిఫిన్స్ లో తినవచ్చును. ఇష్టమైన వారు వెల్లుల్లి వేసుకోవచ్చును. గొంతుకలో పుల్లమారకుండా పొడిలో కొంచెము నూనె లేదా నెయ్యిని కలుపుకొని తినవలెను.
ఇట్లు, మీ అపర్ణ చంద్రశేఖర్, బాధ్యత ఫౌండేషన్, జనహిత ఫార్మర్స్ ఆర్గానిక్ స్టోర్. 8008424344